23 టైట్ అయిపోతోంది

ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ దూరిపోవడం అన్నది హైదరాబాద్ ట్రాఫిక్ లో బైక్ నడిపేవారికి అలవాటైన ఫీట్. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి కూడా అలాగే తయారయింది. ఏవారం అయినా గ్యాప్ కుదిరితే సినిమా వదిలేద్దాం…

ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ దూరిపోవడం అన్నది హైదరాబాద్ ట్రాఫిక్ లో బైక్ నడిపేవారికి అలవాటైన ఫీట్. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి కూడా అలాగే తయారయింది. ఏవారం అయినా గ్యాప్ కుదిరితే సినిమా వదిలేద్దాం అని చూస్తున్నారు నిర్మాతలు.

16న మూడు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. 23న సింగం వాయిదా పడింది అని తెలియగానే రెండు సినిమాలు రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే 23న సప్తగిరి ఎక్స్ ప్రెస్, వంగవీటి వుండనే వున్నాయి. తాజగా విశాల్ ఒక్కొడొచ్చాడు సినిమా తోడయింది.

30న విడుదల కావాల్సిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమా కూడా ముందుకు రావాలా? వద్దా? అనే మీమాంసలో వుంది. అంటే మొత్తం మీద 23న కూడా నాలుగు సినిమాలు రెడీ అయిపోతున్నాయన్నమాట.