ఒక్క హిట్టు చాలు.. హీరో స్టార్ హీరో అయిపోవడానికి. కోట్లు దండుకోవడానికి. నితిన్‌కి వరుసగా రెండు సూపర్ హిట్లు దక్కాయి. అప్పటి వరకూ సాగిన ఫ్లాపుల పరంపరకు ఇష్క్ చమరగీతం పాడితే, గుండెజారి గల్లంతయ్యిందే సినిమా నితిన్‌ని మరో మెట్టు పైకి ఎక్కించింది.
హార్ట్ ఎటాక్ వసూళ్లు కూడా అదిరిపోయే రేంజులో ఉండడంతో నితిన్ పారితోషికం కూడా అమాంతం పెరిగింది. హార్ట్ ఎటాక్‌కి రూ.4 కోట్లు అందుకోన్న నితిన్, ఇప్పుడు తాజాగా నా పారితోషికం రూ.5 కోట్లు అంటున్నాడట. నితిన్ అడిగినంత ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధపడుతున్నారు.
ఎందుకంటే నైజాంలో నితిన్ సినిమాలకు మంచి గిరాకీ ఉంది. దానికి తోడు వరుస హిట్లు కొడుతున్నాడు. ఈమధ్య నితిన్ అభిమానగణం కూడా పెరిగింది. పవన్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు నితిన్‌ని తమ హీరోగానే చూస్తున్నారు. సో… నితిన్‌కి రూ.5 కోట్లు ఇచ్చినా తప్పులేదన్నది నిర్మాత ఫీలింగ్. అందుకే నితిన్ హవా నడుస్తోందిప్పుడు.