బద్రి కథ చెప్పడానికి పూరి ఎన్ని పాట్లు పడ్డాడో తెలుసా..? ఎంతమందికి టోకరా ఇచ్చాడో తెలుసా? ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ దిల్లున్నోడు ఆడియో వేడుకలో చెప్పుకొచ్చాడు. పూరి బద్రి కథ పవన్‌కి చెప్పాలనుకొన్నాడట. కానీ పవన్‌ని కలిసే మార్గం లేదు. పవన్‌ని కలవాలంటే చోటాకె నాయుడిని సంప్రదించాల్సిందే. ఆయన్ని కలిస్తే – కథ ముందు నాకు వినిపించు, నాకు నచ్చితే పవన్‌కి రికమెండ్ చేస్తా అన్నాడట.
కానీ బద్రి వెరైటీ ప్రేమ కథ. ఒకడు ఇద్దరు అమ్మాయిల్ని ఒకేసారి ప్రేమించే కాన్సెప్ట్. చోటాకి అర్థం కాకపోతే వవన్‌ని కలిసే ఛాన్స్ మిస్ అవుతుందనుకొని, బద్రి కథ పక్కన పెట్టి – ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ వినిపించాడట. అది చోటాకి బాగా నచ్చింది. దాంతో పవన్‌కి కలిసి కథ వినిపించే ఛాన్స్ ఇచ్చాడు.
పవన్ దగ్గర మాత్రం పూరి బద్రి కథే చెప్పాడు. అది పవన్‌కి మొదటి సిట్టింగ్‌లోనే నచ్చింది. -కానీ ఇందులో సూసైడ్ కాన్సెప్ట్ లేదే..? చోటా మాత్రం సూసైడ్ కథ అన్నాడు- అన్నాడట పవన్. అది నేను ఆడిన డ్రామా.. అని పూరి చెప్పేశాడట. పూరి తెలివితేటల్ని మెచ్చుకొన్న పవన్ బద్రి చేసే అవకాశం పూరికి ఇచ్చేశాడు. అదీ.. బద్రి సినిమా వెనుక ఉన్న కథ.