తెలంగాణ కొత్త సచివాలయం ప్లానింగ్ న భూతో న భవిష్యత్ అన్నట్లు జరుగుతోంది. దీని కోసం ఏకంగా 700 కోట్లు ఖర్చుచేస్తున్నారు. అయితే ఇందులో కేవలం రెండు వందల కోట్లకు పైగా ఇంటీరియర్ కే ఖర్చుచేస్తారట. అంతే కాదు మొత్తం సచివాలయానికి విదేశీ ఫర్నిచర్ నే వాడతారంట. ఇంకా అదనపు విశేషం ఏమిటంటే ఈ సచివాలయంలో సిఎమ్ ఛాంబర్ పూర్తిగా బుల్లెట్ ఫ్రూప్ తో వుండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఒక్కదారికే యాభై కోట్లు ఖర్చుచేస్తారట.
అంటే ఇక చుట్టుపక్కల సుదూరం నుంచి కూడా ఎవ్వరూ ఏ విధంగానూ ఎటువంటి దాడికి దిగకుండా, ఏ విధమైన అఘాయిత్యానికి పాలు పడకుండా వుంటుందన్నమాట. కేసిఆర్ కు ఈ సచివాలయం విషయంలో ఓ విజన్ వుంది. ఆ విజన్ కు అనుగుణంగా ప్లాన్ ను రూపొందిస్తున్నారు.
మొత్తం 25 ఎకరాల్లో ఏడు అంతస్థులతో ఆరులక్షల చదరపు అడుగుల మేరకు సెక్రటేరియట్ నిర్మాణం వుంటుంది. వేలాది వాహనాలు పార్క్ చేయడానికి వీలుగా ఏర్పాట్లు వుంటాయి. అదే సమయంల గ్రీనరీకి విపరీతమైన ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. లాండ్ స్కేపింగ్ కోసం జాతీయ స్థాయిలో డిజైన్లు రూపొందింపచేస్తున్నారు.