70 రోజుల బస.. నాలుగు రోజులు షూటింగ్

కొంతమంది డైరక్టర్ల వ్యవహారం అలాగే వుంటుంది. తమది కాకుంటే కాశీ దాకా డేకించేద్దామనే టైపు. నిర్మాత బివివిఎస్ ఎన్ ప్రసాద్ ఓ సినిమా తీస్తున్నారు సుకుమార్ డైరక్షన్ లో. ఎన్టీఆర్ హీరో. నాన్నకు ప్రేమతో…

కొంతమంది డైరక్టర్ల వ్యవహారం అలాగే వుంటుంది. తమది కాకుంటే కాశీ దాకా డేకించేద్దామనే టైపు. నిర్మాత బివివిఎస్ ఎన్ ప్రసాద్ ఓ సినిమా తీస్తున్నారు సుకుమార్ డైరక్షన్ లో. ఎన్టీఆర్ హీరో. నాన్నకు ప్రేమతో అనే ఈ సినిమా కోసం ఇప్పటికి విదేశాల్లో 70 రోజులు షూట్ చేసారు. చిత్రమేమిటంటే, ఇలా డెభై రోజులు అక్కడ వుండడానికి చాలా మంది నటులను తీసుకెళ్లారు. బాగానే వుంది. కానీ కొంతమంది చోటా, మోటా నటులను కేవలం నాలుగు రోజులు మాత్రమే వాడుకున్నారని వినికిడి. 

మిగిలిన 66 రోజులు ఆ నటులు హ్యాపీగా, విదేశాల్లో షాపింగ్, వినోదాలతో ఎంజాయ్ చేసారట. అదే సినిమా ఇండియాలో చేసి వుంటే నాలుగు రోజుల ఖర్చుతో పోయేది. ఇప్పుడ డెభై రోజుల పాటు ఆ చిన్న నటులకు కూడా ఖర్చులు భరించాల్సి వచ్చింది. పోనీ డైరక్టర్ ప్లానింగ్ గా వున్నా, అవసరమైనపు పిలిపించి, నాలుగు రోజులు షూట్ చేసి పంపేసి వుండేవారు. ఇలా దుబారా వుండి వుండేది కాదు.