దిల్ రాజు దగ్గరకు ఓ మంచి కథ వచ్చింది అంటే అది దాదాపు హీరోలు అందరికీ తెలిసిపోతుంది. దిల్ రాజు ఆ కథను అందరికీ చెప్పిస్తాడు. ఒపీనియన్లు సేకరిస్తారు. ఎవరు ఏమంటారో? ఎవరి అభిప్రాయం ఏమిటో అన్నీ తెలుసుకుని, అప్పుడు ముందుకు వెళ్తారు. ఫస్ట్ టైమ్ ఓ తమిళ సినిమా రీమేక్ రైట్స్ కొన్నారు దిల్ రాజు. ముందుగా హీరో నానిని చెన్నయ్ తీసుకెళ్లి మరీ సినిమా చూపించారు. ఈ రెండు విషయాలు ముందుగానే వెల్లడించాం.
అదిగో నాని, ఇదిగో సమంత అంటూ, ఆ వార్తలు పట్టుకుని కథలు అల్లేసారు. కానీ అసలు విషయం అది కాదు. మంచి చిన్న సినిమాలు నిర్మించే ఆలోచనలో వున్నారు నాని. ఆ కోణంలో ఆ సినిమాను చూసి వచ్చాడు. అదీ అసలు విషయం.
ఇప్పుడు ఇదే 96 సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, నిన్న రాత్రి స్టయిలిష్ స్టార్ బన్నీ చూసాడు ఆ సినిమాను. అయితే బన్నీ చెన్నయ్ వెళ్లలేదు. ఇక్కడే హైదరాబాద్ లో దిల్ రాజు చూసే ఏర్పాటు చేసారు. అయితే బన్నీకి జస్ట్ ఒపీనియన్ కోసం చూపించారు తప్ప, అదేదో బన్నీతో రీమేక్ చేసేయాలన్న ఆలోచనతో కాదు అని తెలుస్తోంది.
ఇంతకీ ఈ వరుసలో 96 సినిమాను ఇంకెంతమంది చూస్తారో? ఇంకెన్ని గ్యాసిప్ లకు తావిస్తారో? ఇంతకీ ఎవరితో ఈ సినిమాను దిల్ రాజు చూస్తారో? వెయిట్ అండ్ సీ.