cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ అక్కౌంట్ల పై నిఘా ?

ఆ అక్కౌంట్ల పై నిఘా ?

టాలీవుడ్ లోని కొందరు సెలబ్రిటీల అక్కౌంట్లపై ఎన్ ఫోర్స్ డిపార్ట్ మెంట్ కన్ను పడిందని తెలుస్తోంది. ఆ మధ్యన డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని విచారణలు జరిగాయి. 

ఇటు ఇడి విచారణలు అటు సంబంధిత శాఖల విచారణలు జరిగాయి. అంతా ముగిసిపోయింది అనుకున్నారు. కానీ ఇంకా కథ బాకీ వుందని తెలుస్తోంది. కొందరు సెలబ్రిటీల ఖాతాలపై ఈడీ శాఖ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వాటిల్లో జరిగే లావాదేవీలను పరిశీలించడమే కాదు ఆ వెంటనే ప్రశ్నిస్తున్నట్లు తెలుుస్తోంది

దీంతో ఇండస్ట్రీ జనాలు, ఆ అక్కౌంట్ హోల్డర్లు కాస్త జాగ్రత్త పడుతున్నట్లు బోగట్టా. మాదకద్రవ్యాల కేసులో విచారణలు పూర్తయ్యాయి. అంతా ఓకె అనుకుంటున్నారు. కానీ తెరవెనుక ఇంకా ఏదో జరుగుతున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. 

ముఖ్యంగా సినిమాల పేరు చెప్పి విదేశీ అక్కౌంట్లకు డబ్బులు చేరవేసిన అక్కౌంట్ ల మీద దృష్టి ఎక్కువగా పెట్టినట్లు, వాటిల్లో జరుగుతున్న లావాదేవీలను చాలా నిశితంగా అబ్జర్వ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

హీరోలు, హీరోయిన్లు, నటులు, దర్శకులు, ఇంకా చాలా మంది వున్నారు ఈ వ్యవహారంలో. వీళ్ల అందరి అక్కౌంట్లు ఇప్పుడు నిఘాలోనే వున్నట్లు తెలుస్తోంది.

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!