టీడీపీ ని నిషేధించాల్సిందే….?

తెలుగుదేశం పార్టీ వయసు నాలుగు దశాబ్దాలు. వెండి తెర వేలుపు ఎన్టీయార్ ఏర్పాటు చేసిన పార్టీ అది. ఇక కాంగ్రెస్ నుంచి వచ్చిన చంద్రబాబు టీడీపీని గత పాతికేళ్ళుగా ప్రెసిడెంట్ గా ఏలుతున్నారు. Advertisement…

తెలుగుదేశం పార్టీ వయసు నాలుగు దశాబ్దాలు. వెండి తెర వేలుపు ఎన్టీయార్ ఏర్పాటు చేసిన పార్టీ అది. ఇక కాంగ్రెస్ నుంచి వచ్చిన చంద్రబాబు టీడీపీని గత పాతికేళ్ళుగా ప్రెసిడెంట్ గా ఏలుతున్నారు.

ఇదిలా ఉంటే టీడీపీ గెలుపుని ఎలా అస్వాదిస్తుందో కానీ ఓటమిని మాత్రం అసలు జీర్ణించుకోవడం లేదు అని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రత్యేకించి జగన్ ముఖ్యమంత్రి కావడం అంటే టీడీపీకి కంటగింపుగానే ఉంది అన్న మాట ఎప్పటి నుంచే ఉంది. అందుకే కావాలని టీడీపీ రెచ్చగొట్టుడు రాజకీయాలకు తెర తీస్తూ వైసీపీని దెబ్బతీయాలని చూస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇంత అద్వాన్న రాజకీయాలు, వినాశన రాజకీయాలు చేస్తున్న టీడీపీకి ఒక రాజకీయ పార్టీగా ఉండే హక్కు లేదని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. ప్రజాస్వామ్యాన్నిఅపహాస్యపరుస్తున్న టీడీపీని ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగించకుండా గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతామని కూడా ఆయన చెబుతున్నారు. 

టీడీపీ నేతలు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని చంద్రబాబు వాటిని సమర్ధిస్తున్నారని కూడా బొత్స మండిపడ్డారు. టీడీపీ దారుణంగా మాట్లాడుతూంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడమేంటి అని కూడా బొత్స ప్రశ్నించారు. 

మొత్తానికి రాజకీయాల్లో టీడీపీని లేకుండా చేయాలని, ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని బొత్స కోరడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే చూడాలి.