ఆ అమ్మడి డిమాండ్ 70 లక్షలు

చేసింది ఒక్క సినిమా. కానీ ఇంకా అది కూడా విడుదల కాలేదు. సినిమా వాళ్లు సెంటి మెంట్ ప్రకారం గోల్డెన్ లెగ్ అవుతుందో కాదో ఇంకా తెలియదు. కానీ ఆమెను చాన్స్ లు వెదుక్కుంటూ…

చేసింది ఒక్క సినిమా. కానీ ఇంకా అది కూడా విడుదల కాలేదు. సినిమా వాళ్లు సెంటి మెంట్ ప్రకారం గోల్డెన్ లెగ్ అవుతుందో కాదో ఇంకా తెలియదు. కానీ ఆమెను చాన్స్ లు వెదుక్కుంటూ వస్తున్నాయి. దాంతో డిమాండ్ ఓ లెక్కలో వుందని బోగట్టా.

ఇదందా ఉప్పెన సినిమాలో నటించిన కృతి శెట్టి సంగతే. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరైనా హీరోయిన్ గా తీసుకోవాలి అంటే కనీసం 70 లక్షలు రెమ్యూనిరేషన్ కు సిద్దం కావాలని తెలుస్తోంది.

'నీ కన్ను నీలి సముద్రం అనే ఒకే ఒక్క విడియో సాంగ్ తో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి పాపులర్ అయిపోయింది. కరోనా కారణంగా సినిమా మాత్రం విడుదల కాలేదు.

అయితే ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి. కానీ వచ్చిన వారు ఆశ్చర్యపోయేలా రేటు కూడా వినిపిస్తోంది. డెభై లక్షలు, సరైన బ్యానర్, సరైన కాంబినేషన్ అయితేనే ఓకె లేదంటే లేదు అన్నది నియమ నిబంధనలు అని వినికిడి. ఇష్టం వచ్చినట్లు సినిమాలు ఓకె అనకుండా, టాప్ హీరోల పక్కన చాన్స్ ల కోసం చూస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

అంతే మరి..తెలుగులో కాస్త అందమైన హీరోయిన్లే కరువైపోతున్నారు.  అలాంటపుడు ఇలాంటి డిమాండ్లే వినిపిస్తాయి.

నిమ్మ‌గ‌డ్డ అఖ‌రి ఆశ…ఇక గ‌వ‌ర్న‌ర్ పైనే భారం