యువ హీరో సుమంత్ అశ్విన్, సీనియర్ హీరో శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్నచిత్రం `ఇదే మా కథ` . రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నఈ చిత్రానికి గురుపవన్ దర్శకుడు. జి.మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .
హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో `ఇదే మా కథ ఫస్ట్` లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో ప్రధాన పాత్ర ధారులు రైడర్స్ గెటప్ లో బైక్ మీద రైడింగ్ కి వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా..
ప్రొడ్యూసర్ జి. మహేష్ మాట్లాడుతూ – “ఇది మనందరి కథ. ఇందులో నా కథ కూడా ఉంది. అందుకే సినిమా రిలీజ్ కోసం నేను కూడా ఈగర్‌గా వెయిట్‌చేస్తున్నాను. చాలా ఎమోషన్స్‌తో ట్రావెల్ అయ్యే స్క్రిప్ట్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది“ అన్నారు.
దర్శకుడు గురుపవన్ మాట్లాడుతూ – “లాక్ డౌన్ కి ముందే షూటింగ్ స్టార్ట్ చేసి లడఖ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఈ సినిమా..లాక్‌డౌన్ సమయంలో అందరిలాగే మా టీమ్ కూడా కొంత నిరాశకు గురయ్యాం.
అయితే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకోవడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేశాం. ఇంకా మనాలి షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. డిసెంబర్‌లో షూటింగ్ పూర్తిచేస్తాం ఇది రైడర్స్ స్టోరి తప్పకుండా నచ్చుతుంది“అన్నారు.
హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ – “ఇలాంటి డిఫికల్ట్ టైమ్‌లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ని ఆర్గనైజ్ చేస్తున్న నిర్మాత మహేష్ గారికి కృతజ్ఞతలు. శ్రీకాంత్ గారు,భూమిక లాంటి ఎక్స్‌పీరియన్డ్స్ యాక్టర్స్‌తో నటించడం ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్“ అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ – “నాకు బైక్ రెడింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా సార్లు రైడింగ్‌కి వెళ్లాను. అలాగే ఒక సారి హైదరాబాద్ నుండి లడక్ కార్‌లో వెళ్లాను. చాలా రోజుల తర్వాత మళ్లీ మంచి టీమ్‌తో కలిసి లడక్ వెళ్లడం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ సి. రామ్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ జెకె మూర్తి, ఎడిటర్ జునైద్ సిద్దికి, కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్, సాత్విక్ మరియు వికాస్ బైక్ రైడింగ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.