శర్వానంద్-14 రీల్స్ ప్లస్ మధ్య రెమ్యూనిరేషన్ బకాయి విషయం మీడియాకు లీకులు ఇవ్వడంలో ఓ డైరక్టర్ కీలకపాత్ర పోషించినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తన్నాయి.
శ్రీకారం సినిమా డబ్బింగ్ సినిమా వేళకు రెమ్యూనిరేషన్ పూర్తిగా ఇవ్వాలని హీరోకు నిర్మాతలకు మధ్య అగ్రిమెంట్ వుంది. కానీ అది పూర్తి చేయకుండానే సినిమాను విడుదల చేసారు. ఈ మేరకు హీరోకు కొన్ని చెక్కులు ఇచ్చారు.
సినిమా విడుదలయిపోయింది.చాలా కాలం గడచిపోయింది. నిర్మాతలు మాత్రం స్పందించలేదని తెలుస్తోంది. శర్వా ఈ విషయంలో చాలా ప్రయత్నించి, చివరకు విసిగిపోయి చెక్కులు బ్యాంక్ లో వేసి, బౌన్స్ కావడంతో లీగల్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయం గుట్టుగానే వుంది. ఇలాంటి టైమ్ లో 14 రీల్స్ తో సంబందాలు వున్నఓ డైరక్టర్ ఈ విషయాన్ని బయటకు లీక్ చేసినట్లు గుసగుసలు వినిపించడం లేటెస్ట్ సంగతి.
నిర్మాతల పట్ల సింపతీ వుండి, హీరో ఇలా చేయడం ఏమిటి అనే ఆలోచనతోనో, మరే ఉద్దేశంతోనో ఆ డైరక్టర్ తన మిత్రుల ద్వారా ఆ న్యూస్ ను బయటకు తెచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆ విధంగా హీరో-ప్రొడ్యూసర్ల మధ్య వ్యవహారం బయటకు వచ్చింది.