ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య శ్రీరామ దండకం పాడి విడుదల చేసేసారు. జనం విని తరించారు. అది వేరే సంగతి.
ఇది కాక ఓ ఫస్ట్ లుక్ కూడా బాలయ్య వాయిస్ ఓవర్ తో విడుదల కావాల్సింది. కానీ మిస్ అయిందని తెలుస్తోంది.
విషయం ఏమిటంటే నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ వచ్చింది. నిజానికి పోస్టర్ కు బదులు చిన్న విడియో బైట్ ఇవ్వాలని అనుకున్నారట.
కానీ దానికి బాలయ్య వాయిస్ ఓవర్ అయితే బాగుంటుందని కళ్యాణ్ రామ్ అనుకున్నారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని బోగట్టా. కానీ బాలయ్య తో వాయిస్ ఓవర్ చేయించడానికి టైమ్ కుదరకపోవడంతో పోస్టర్ తో సరిపెట్టేసుకున్నారు.
అంటే తరువాత వచ్చే టీజర్ లో అయినా బాలయ్య వాయిస్ ఓవర్ వుంటుందన్నమాట. బాలయ్య వాయిస్ ఓవర్ ఇస్తే ఎలా వుంటుందో అన్నది కాస్త ఆసక్తి కరమే.