చాలా కాలంగా ఖాళీగా కూర్చున్నాడు డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్. ఖాళీగా అంటే ఖాళీగా కాదు, పవన్ కళ్యాణ్ కోసం తమిళ సినిమా స్క్రిప్ట్ ను తెలుగులోకి మారుస్తూ. ఇంతలో ఆ సినిమా తెలుగులోకి డబ్ అయిపోయింది.
దాంతో మొత్తం మళ్లీ మార్చాడు. ఇలా మార్చుతూ.. మార్చుతూ వుంటూ వుండగానే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమాల మీద వైరాగ్యం ప్రకటించి, పాలిటిక్స్ లోకి సీరియస్ గా ఎంటర్ అయిపోయారు.
ఇప్పట్లో పవన్ సినిమా చేస్తార? చేయరా? అన్నది డౌట్. చేయకపోవడానికే ఎక్కవ ఆస్కారం వుందని వినిపిస్తోంది. మరి అలాంటపుడు బోలెడు ఖర్చు చేసి, నిర్మాతకు బోలెడు వ్యయం మిగిల్చి, చేసిన ఈ స్క్రిప్ట్ ను ఏం చేయాలి? ఏ రవితేజ తోనో చేయాలి.
సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేయాలన్న మైత్రీ సంస్థకు రవితేజ డేట్ లు అయితే వున్నాయి. కానీ అసలు పక్కాగా పవన్ చేయను అని చెప్పే వరకు కదలడానికి లేదు.
అలా కదిలే టైమ్ రావాలి. అలా వచ్చిన నాటికి ఈ సబ్జెక్ట్ కు సూటయ్యే హీరో దొరకాలి. లేదూ అంటే ప్రాజెక్టు అటకెక్కేస్తుంది. అప్పుడు పాపం, సంతోష్ శ్రీనివాస్ నెలల తరబడి చేసిన శ్రమ వృధా అయిపోతుంది. పవన్ కోసం చేసిన స్క్రిప్ట్ ను చేసే ధైర్యం ఏ హీరో చేస్తారో చూడాలి.