సినిమా రంగంలో రాత్రికి రాత్రే జాతకాలు తిరగబడిపోతుంటాయి. నిన్న రాజు, రేపు బంటు అవుతాడు. భవ్య ఆర్ట్స్ వాళ్ళు హీరో గోపీచంద్‌తో నిర్మించే కొత్త చిత్రానికి శ్రీధర్ పీపాన అనే రైటర్ కథ అందించాడు. ఆ కథకు ముందు వీరభద్రమ్చౌదరిని దర్శకుడిగా అనుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చారు.
అయితే వీరభద్రమ్‌చౌదరి, అక్కినేని నాగార్జునకి ‘భాయ్’ అనే భయంకరమైన ఫ్లాప్ ఇవ్వడంతో లెక్కలు మారిపోయాయి. హీరో గోపీచంద్ తనకు ఆ డైరెక్టర్ వద్దు అని చెప్పడంతో వీరభద్రమ్ చౌదరికి సినిమా చేజారిపోయింది. గతంలో ‘శౌర్యం’ పేరుతో గోపీచంద్‌కు సినిమా చేసిన శ్రీవాసు ఇప్పుడు ట్రాక్‌లోకొచ్చాడు.
ఇటీవల పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంతో మళ్ళీ ఫాంలోకొచ్చిన శ్రీవాసుని భవ్య ఆర్ట్స్ చిత్రానికి దర్శకుడిగా తీసుకున్నారు. గతంలో ‘రామ రామ కృష్ణ కృష్ణ’ ఫ్లాప్‌తో శ్రీవాసు కూడా వీరభద్రమ్లా కొన్ని రిస్కులు ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం హీరో గోపీచంద్ సినిమా చేజారిపోవడంతో వీరభద్రమ్ చౌదరి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.