సినిమాకు హీరోలు లేటుగా రావడం మామూలే..హీరోయిన్లు లేటుగా రావడం మామూలే. ఇంకా కాదంటే, కాస్త లీడింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు లేటుగా రావడం మామూలే. కానీ సినిమాకు కెప్టెన్ లాంటి డైరక్టర్ లేటుగా రావడం అన్నది చాలా అరుదు. సాధారణంగా ముందు రోజు రాత్రే మర్నాటి సీన్లు అన్నీ డిస్కషన్ చేసేస్తారు. అసిస్టెంట్లు, అసోసియేట్లు, ఆ మేరకు చకచకా ఏర్పాట్లు చేసేస్తారు. నటీనటులకు సీన్ వివరించడం కూడా వారి వంతే. ఆ పైన డైరక్టర్ వచ్చి, అన్నీ ఏర్పాట్లు ఓసారి సరిచూసుకుని, టేక్..కట్..ఓకె అనిపించేస్తారు.
ఇలాంటపుడు హీరోలు లేటుగా వస్తే ఓపిగ్గా కాసుకుని వుంటారు. కానీ ప్రస్తుతం నిర్మాణలో వున్న ఓ మీడియం మల్టీస్టారర్ లాంటి సినిమాకు డైరక్టర్ ఆలస్యంగా వస్తున్నారని టాలీవుడ్ టాక్. ఎనిమిదింటికి షెడ్యూలు అంటే 11కి, మధ్యాహ్నం రెండు అంటే అయిదుకు వస్తున్నారట. దాంతో హీరో తదితర నటులు వెయిట్ చేయాల్సి వస్తోందట.
అప్పటికి ఒకటి నాలుగు సార్లు చెప్పారట కూడా. అయినా, నో యూజ్ కావడంతో, మరేం చేయలేక ఊరుకున్నారట. కామెడీ చిత్రాలు బాగా హ్యాండిల్ చేస్తాడని పేరున్న ఆ దర్శకుడు మరి ఇలా కావాలని చేస్తున్నారో, కామెడీ కోసం చేస్తున్నారో?