సర్దార్ గబ్బర్ సింగ్ ఎప్రియల్ 8 విడుదలకు రెడీ అన్న ఫీలర్లు బయటకు వచ్చాయి. ఇదే డేట్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఇప్పుడు నిర్మాణ వర్గాలు తమకు సన్నిహితమైన మీడియా జనాలకు ఈ మేరకు డేట్ పక్కా అని చెప్పినట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి. అంటే మార్చి ఎనిమిది రోజులు వదిలేసినా దాదాపు యాభై రోజుల టైమ్ వున్నట్లు లెక్క. మరి ఈ టైమ్ సరిపోతుందా..సరిపోదా అని అంచనాలు కడుతున్నాయి.
సర్దార్ గబ్బర్ సింగ్ కొన్ని పాటల కోసం విదేశాలకు వెళ్లాల్సి వుంది. అలాగే ఇంకా టాకీ పార్ట్ సగం వరకు వున్నట్లు వినికిడి. ఆపైన పోస్ట్ ప్రొడక్షన్ ఎలాగూ వుంటుంది. ఎలా కాదన్నా టాకీ పార్ట్, పాటలు , ముఫై రోజుల్లో ఫినిష్ చేయాలని పట్టుదలగా వుంది యూనిట్ అని వినికిడి. ఆపైన ఇరవై రోజుల్లో రీ రికార్డింగ్..ఎడిటింగ్, డీటీఎస్ లాంటి పనులకు పరుగులు పెట్టాల్సి వుంటుంది.
ఇప్పటి నుంచి ఎక్కడా ఆగకుండా, చకచకా బండి లాగిస్తే తప్ప, ఈ షెడ్యూలింగ్ అంతా పక్కాగా ప్లాన్డ్ గా వెళ్తే తప్ప, ఏప్రియల్ 8 విడుదల అన్నది కాస్త ఇబ్బందికరమే అన్నది టాలీవుడ్ జనాల అంచనా. అయితే పెద్ద సినిమా కాబట్టి, డేట్ మార్చడం అన్నది సమ్మర్ లాంటి సీజన్ లో కాస్త ఇబ్బంది కర విషయం కాబట్టి, ఎక్కడా ఆపకుండా పనలు చేసే పనిలో వుంది యూనిట్.