చిరకాలంగా సినిమా కోసం వెయిటింగ్ జాబితాలో వున్నాడు డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్. మైత్రీ మూవీస్ పుణ్యమా అని ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే డైరక్ట్ చేసే చాన్స్ వచ్చేసింది. కానీ స్క్రిప్ట్ అంతా చెక్కి, రెడీ చేసేసరికి ఆ చాన్స్ కాస్తా చేజారిపోయింది.
స్క్రిప్ట్ ను వేరే వాళ్లతో చేసుకోమని, అలాగే సంతోష్ శ్రీనివాస్ ను వేరే సినిమా చేసుకోమని పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. కానీ హీరో ఎవరూ రెడీగా లేరు. పైగా ఆ సబ్జెక్ట్ అంటే ఆప్షన్లు చాలా తక్కువ. ఆ స్క్రిప్ట్ పవన్ తప్పిస్తే, రవితేజకు మాత్రమే సూటవుతుందని వినికిడి.
ఇక్కడ మళ్లీ సమస్య. మైత్రీ మూవీస్ అదే రవితేజతో ఇప్పుడే ఇంకా సినిమా స్టార్ట్ చేసింది. పోనీ బ్యాక్ టు బ్యాక్ చేయాలన్నా కనీసం ఆరేడు నెలలు ఆగాలి. ఇక సంతోష్ శ్రీనివాస్ కు వేరే దారి లేదు. ఇన్నాళ్లు వెయిట్ చేసినట్లు, మరో ఆరేడు నెలలు వెయిట్ చేయడం మినహా. అప్పుడు మైత్రీ మూవీస్ నే రవితేజతో ఆ సినిమా చేయడానికి రెడీ అని వినికిడి.