నాగ్ చైతన్య ఫుల్ బిజీ. వరుసగా సినిమాలు వున్నాయి. ఎందరో నిర్మాతలు చైతూతో సినిమా చేస్తున్నారు కానీ మేనమామ దగ్గుబాటి సురేష్ బాబు మాత్రం సినిమా చేయడం కుదరడం లేదు. యుద్ధం శరణం సురేష్ మూవీస్ బ్యానర్ లో రెడీ కావాల్సిందే కానీ చివరి నిమిషంలో తప్పిపోయింది.
ఆ తరువాత వెంకీ-చైతూ కాంబినేషన్ లో సినిమా అనుకున్నారు. కళ్యాణ్ కృష్ణ డైరక్టర్ అనుకున్నారు. కానీ టైమ్ సెట్ కాక కళ్యాణ్ తప్పుకున్నాడు. ఆఖరికి ఇప్పుడు అదే కాంబినేషన్ కు బాబీ వచ్చి చేరాడు. ఆ సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను సురేష్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తారని తెలుస్తోంది.
అయితే సోలోగా సురేష్ మూవీస్ బ్యానర్ మాత్రమే వుండదు. నేనేరాజు నేనే మంత్రి మాదిరిగా మరో బ్యానర్ ఏదో ఒకటి జోడిస్తారు. సురేష్ మూవీస్, రామానాయుడు స్టూడియోస్ సమర్పణ వుంటుంది.
ఆ విధంగా చైతూతో మేనమామ దగ్గుబాటి సురేష్ నిర్మాణం, మరో మేనమామ వెంకీ కాంబినేషన్ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.