Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ హార్డ్ డిస్క్ లో ఎన్ని సినిమా క్లిప్పింగ్ లో

ఆ హార్డ్ డిస్క్ లో ఎన్ని సినిమా క్లిప్పింగ్ లో

నిన్నటికి నిన్న గ్రేట్ ఆంధ్ర బయటకు తెచ్చింది గీతాఆర్ట్స్ లో జరిగిన పైరసీ ప్రయత్నాన్ని. గుట్టుగా వుంచి, విచారిస్తున్న ఈ విషయం దీంతో పబ్లిక్ లోకి వచ్చింది. అసలు ఈ ఉదంతం ఎలా జరిగింది, దీనివెనుక అసలు ఏమిటి విషయం. అసలు గీతాఆర్ట్స్ అంటే అన్నీ పద్దతిగా పకడ్బందీగా వుండే సంస్థ. అక్కడ ఉద్యోగుల కన్నా నమ్మకస్తులు ఎక్కువగా వుంటారని టాక్ వుంది ఇండస్ట్రీలో.

ఎందుకంటే అల్లు అరవింద్ అలా ఏరికోరి తనవాళ్లు అనుకునేవారిని గీతాలోని వివిధ ప్లేస్ ల్లో. అలాంటిది అక్కడి నుంచే సినిమా రా కంటెంట్ బయటకు వెళ్లిపోయింది అంటే ఏమనుకోవాలి? బహుశా అందుకే ఈ విషయాన్ని గుట్టుగా వుంచాలని అనుకున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందడంతో గ్రేట్ ఆంధ్ర దాన్ని బయటకు తెచ్చింది. దాంతో ఇక విషయాన్ని బయటపెట్టక తప్పలేదు.

టాక్సీవాలా సినిమా యువి క్రియేషన్స్ కు సంబంధించినది. కానీ యువికి గీతాకు అనేక రకాల బంధాలు వుండడంతో, ఆ సినిమా కంటెంట్ ను కూడా గీతాలోని ఎడిట్ సూట్ లోనే వుంచారు. కానీ విషయం వేరు వుంది. సాధారణంగా రా ఫీడ్ ను మూడు అక్షరాల పేరున్న ఓ ప్రయివేటు సంస్థకు పంపిస్తుంటారు. ఆ సంస్థలో కంప్యూటర్ వర్క్ జరుగుతుంటుంది. అక్కడ పనిచేసే సిస్టమ్ ఎడిటర్ కు ఓ అలవాటు వుంది.

అతగాడి దగ్గర హార్డ్ డిస్క్ ల్లో డిలీట్ చేసేసిన కంటెంట్ ను మళ్లీ వెలికితీసే సాఫ్ట్ వేర్ వుంది. దాని సాయంతో వివిధ సినిమా క్లిప్పింగ్ లను, రా ఫీడ్ ను బయటకు తీసేవాడు. వాటిని తన హార్డ్ డిస్క్ లోకి తీసుకుని ఇంటికి తీసుకెళ్లేవాడు. అలా తీసుకెళ్లిన ఫీడ్ ను తన చుట్టమైన ఓ అమ్మాయికి పంపేవాడు.

ఇదంతా సినిమాల్లో డిలీటెడ్ కంటెంట్ ను చూడాలనే ఆనందం, కుతూహలం కోసం చేసిన సంగతి. అలా కంటెంట్ ను అందుకున్న అమ్మాయి, తనుచూసి ఊరుకోకుండా, తన స్నేహితులకు చూపించేది. అలా ఇటు గీత గోవిందం, అటు టాక్సీవాలా రా కంటెంట్ ను తిన్నగా కృష్ణాజిల్లాలో కీలక యూనివర్సిటీ స్టూడెంట్స్ కు చేర్చేసారు. అక్కడ కంటెంట్ నుంచి ఓ స్క్రీన్ షాట్ ను తీసి, బయటకు షేర్ చేయడంతో అసలు సంగతి బయటకు వచ్చింది.

దాంతో పోలీసులకు చెప్పి గుట్టుగా విచారణ స్టార్ట్ చేయించారు. విడుదలకు ముందు ఇలా జరిగింది అని తెలిస్తే సమస్య అని భావించి సైలెంట్ గా వున్నారు. పోలీసులు మొత్తం తీగలాగే ఆ వ్యక్తి హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకుంటే, వాటిలో చాలా అంటే చాలా సినిమాల కంటెంట్ వున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా ఈవారం విడుదలయిన ఓ పెద్ద సినిమా కంటెంట్ కూడా వుందని తెలిసింది.

రాబోయే సినిమాల కంటెంట్ కూడా వుందని వినికిడి. దీంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. నిర్మాత దిల్ రాజు సారధ్యంలో పలువురు ఇవ్వాళో రేపో సమావేశం అవుతున్నారు. ఆ కంప్యూటర్ సంస్థ యాజమాన్యం కూడా విస్తుఫోతోంది విషయం తెలిసి. తమ ఎంప్లాయి ఇలా చేయడం వల్ల తమ సంస్థ ఇరుకున పడిందని కిందామీదా అవుతోంది.

ఇదిలా వుంటే కంప్యూటర్ సంస్థ ఉద్యోగి నుంచి కంటెంట్ అందుకున్న అమ్మాయితో సహా పలువురు ఇప్పుడు పోలీసుల అదుపులో వున్నారు. వాళ్ల భవిష్యత్ మొత్తం ఇప్పుడు అయోమయంలో పడింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?