కళ్లకు కనిపించేందంతా నిజం కాదు… ప్రత్యేకించి వ్యక్తుల క్యారెక్టర్ విషయంలో అప్పీరియన్స్ కు .. అనిపించే దానికి ఎలాంటి సంబంధాలూ ఉండవు. ఆ హీరోగారి తీరు చూస్తే ఇలాంటి అభిప్రాయాలు బలపడతాయి. చాలా సంవత్సరాల క్రితమే తెరకు పరిచయమై ఇప్పటి వరకూ సరైన హిట్స్ ఏమీ లేకపోయినా.. అడపాదడపా కుటుంబం ఇమేజ్ తో వచ్చే ఒకటీ రెండు సినిమాల్లో చేసుకొంటూ కాలం గడుపుతున్నాడీయన. పైకి చాలా సైలెంట్ గా కనిపించే స్వభావం. రసికత విషయంలో మాత్రం మనోడు పూర్తిగా ఆపోజిట్!
ఆ మధ్య ఇతడితో కలిసి చేసిన ఒకప్రముఖ హీరోయిన్ ను దాదాపు గా హెరాస్ చేశాడట ఈ హీరో. మామూలుగా కాదు.. ఆ హీరోయిన్ షూటింగ్ స్పాట్ కు రావడానికే భయపడేంతలా! అప్పటికే ఆ హీరోయిన్ ఒక ప్రముఖ హీరోకి దాదాపుగా బంధీ. దానికి తోడు ఈ హీరో కూడా ఆ సినిమాకు హీరోగా తన పరపతిని ఆమెపై ప్రదర్శించడంతో…వీళ్లిద్దరూ ఆమె మీద పడిపోవడంతో తన మానసికంగా కూడా నలిగిపోయింది. వీళ్ల ధాటికి తట్టుకోలేక… తను షూటింగ్ కూడా హాజరు కాలేకపోతున్నాని.. ఆ సినిమా దర్శకుడికి విన్నవించుకొంది. మరి ఈ హీరోల నేపథ్యం చూసి ఆ దర్శకుడు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి.
ఆమె చిత్రవధ అవుతోందని.. వీళ్ల టార్చర్ తట్టుకోలేకపోతోందని.. ఆ సినిమా యూనిట్ మెల్లగా బయటకు లీక్ చేసింది. మొత్తంగా ఈ మెత్తటి హీరో సరసన ఆ సినిమాను పూర్తి చేసే సరికి ఆ హీరోయిన్ పై ప్రాణాలు పైనే పోయాయి. అయితే ఇప్పుడు ఆమె ఇలాంటి హీరోలకు అందే స్థితిలో లేదు. ఒక రేంజ్ లో ఉంది. ఈ హీరో పరిస్థితి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.