కరోనా వచ్చి తగ్గుతున్న నేపథ్యంలో దాదాపు ప్రతి హీరో ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఈ హీరో ఖాళీగా వున్నాడు అని చెప్పుకోవడానికి లేదు. దాదాపుగా కొత్త, పాత ప్రతి హీరో ఒకటో, రెండో సినిమాలు లైన్ లో పెట్టుకుని వున్నారు. కానీ ఓ చిన్న హీరో వ్యవహారం మాత్రం వేరుగా వుందట. ఆ హీరోతో సినిమా తీస్తే వర్కవుట్ కాదు అనే భావన సినిమా రంగంలో బాగా ప్రచారం అయిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
నిజానికి ఆ చిన్న హీరోతో చాలా మంది సినిమాలు ప్లాన్ చేసారు. కానీ ఏదీ కూడా ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లడం లేదు. ఆ మధ్య పెద్ద హిట్ కొట్టిన ఓ మిడ్ రేంజ్ డైరక్టర్ సరదాగా ఓ సినిమా ఇదే హీరోతో ప్లాన్ చేసారు. కానీ ఇలా ప్లాన్ చేసి అలా మిడిల్ డ్రాప్ అయ్యారు. ఈ సంగతి తెలిసి వేరే నిర్మాతలు ఆ స్క్రిప్ట్ తమకు ఇవ్మమని అంటున్నారు తప్ప, హీరోగా మాత్రం ఎవరెవరి పేర్లో లెక్కలు వేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ హీరోతో చేస్తే రెండు, మూడు కోట్లకు మించి వర్కవుట్ కాదని ఫీలవుతున్నారు.
నిజానికి ఉజ్వలంగా వుండాల్సిన కెరీర్ ను రాంగ్ ట్రాక్ పట్టి లేదా, రాంగ్ డెసిషన్ల వల్ల ఇలా తయారుచేసుకున్నాడు సదరు హీరో అని కామెంట్లు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. నిజానికి ఇండస్ట్రీలో బ్యాకింగ్ లేకుండా వుండి పైకి రావాలి అంటే ముందు కావాల్సింది సెల్ఫ్ డిసిప్లిన్, ఆ తరువాత కావాల్సింది వైజ్ డెసిషన్లు. ఈ రెండూ ఆ హీరోకి మిస్ అయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో.