ఆమె ఓ హీరోయిన్. టాలీవుడ్ స్టయిలిష్ హీరో సినిమాతో ముద్దుగా, బొద్దుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వున్నట్లుండి మెరుపుతీగలా మారిపోయింది. గ్లామర్ డాల్ గా కనిపించింది. కానీ అలా రెండు మూడు సినిమాలు చేసి టక్కున మాయం అయింది. ఏమయిందో తెలియదు..కానీ ఆమె ఓ నిర్మాత తో సహజీవనం చేస్తోందని మాత్రం ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి.
మంచి అభిరుచి గల ఆ నిర్మాత, మాంచి హుషారు, గుడ్ లుక్స్ తోనే వుంటారు. సో ఈ ఇద్దరు బాగానే సహజీవనం సాగిస్తున్నారని వినికిడి. ఇప్పుడు ఈ మాజీ హీరోయిన్ ఓ రెండు మూడేళ్ల పాపతో తరచు కార్లో కనిపిస్తోందట. దాంతో టాలీవుడ్ జనాలు ఈమెకు ఎప్పుడు పెళ్లయింది ? పాప ఎప్పుడు పుట్టింది? అని పజిల్ అవుతున్నారట. బహుశా ఇది ఆ సహజీవన సాఫల్యం అని చెవులు కొరుక్కుంటున్నారు.