టీవీ నుంచి ఎకాయెకి తెలుగు తెరమీద హీరోయిన్ గా మారిపోయింది సిమ్రాన్ పరీన్ జా. నిఖిల్ సరసన కిర్రాక్ పార్టీలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా విడుదల కాకుండానే ప్రోమోలు చూసి మరో సినిమాకు ఎంపిక చేసేసారు.
నాగశౌర్య హీరోగా శ్రీనివాస చక్రవర్తి అనే కొత్త దర్శకుడి కాంబినేషన్ లో నిర్మించే నర్తనశాల సినిమాకు ఈ జూనియర్ సిమ్రాన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసేసినట్లు బోగట్టా.
పట్టుమని పాతికేళ్లు లేని ఈ ముద్దుగుమ్మ ఇటు ఫ్యామిలీ ఫేస్ గానూ, అటు యంగ్ లుక్స్ తోనూ కూడా కనిపించేందుకు వీలుగా వుంటుంది. అందుకే నర్తనశాలలోకీ రోల్ కు ఆమెను తీసుకున్నారు. అయితే బేరసారాలు ఇంకా పూర్తి కాలేదు. అగ్రిమెంట్ కూడా కావాల్సి వుంది.
ఛలో సినిమా తరువాత నాగశౌర్య రెండు సినిమాలు స్టార్ట్ చేయాల్సి వుంది. కేమేరామెన్ సాయి శ్రీరామ్ తో ఒకటి, శ్రీనివాస చక్రవర్తితో మరొకటి. సాయి శ్రీరామ్ స్క్రిప్ట్ విషయంలో ఇంకా శషభిషలు వుండడంతో ముందుగా శ్రీనివాస చక్రవర్తి నర్తనశాలను ప్రారంభిస్తున్నారు.
ఏప్రియల్ ఫస్ట్ వీక్ లో ప్రారంభమయ్యే ఈ సినిమా కోసం కాస్టింగ్, టెక్నికల్ టీమ్ ఎంపిక ప్రారంభమైంది. ఈ జూనియర్ సిమ్రాన్ నే ఆ విధంగా బోణీ కొట్టినట్లు అనుకోవాలి.