Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ ఇద్దరూ ప్రేమమ్ చూస్తారట

ఆ ఇద్దరూ ప్రేమమ్ చూస్తారట

ఒకరికి కొడుకు..మరొకరికి మేనల్లుడు..నాగ్ చైతన్య ఇచ్చిన ప్రేమమ్ హిట్ ఇప్పుడు ఆ ఇద్దరికి మహా ఆనందాన్ని ఇచ్చింది. అయితే సినిమా విడుదలకు ఆ ఇద్దరు, అదే నాగార్జున, వెంకటేష్ ఇక్కడ లేరు. నాగ్ దుబాయ్ కు వెళ్లి, అక్కడి నుంచి మహా బలేశ్వర్ లో ఓంనమో వేంకటేశాయ షూటింగ్ కు వెళ్లిపోయారు. 

వెంకీ తన గురు సినిమా షూటింగ్ కోసం చెన్నయ్ లో మకాం పెట్టారు. ఇప్పుడు ఈ ఇద్దరు నగరానికి మంగళవారం తిరిగివస్తున్నారు. రాగానే ఇద్దరు చేయబోయే పని ఒకటేనట. ప్రేమమ్ చూడడం. బహుశా నాగార్జు ప్రసాద్ ల్యాబ్ లో, వెంకటేష్ తన స్టూడియోలో చూసే అవకాశం వుంది. ప్రేమమ్ సినిమాలో చైతూ కోసం వెంకీ, నాగ్ ఇద్దరు అతిథిపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?