ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది?

ప్రకాష్ రాజ్ అంటే కాస్త దుడుకు, లేదా షార్ట్ టెంపర్ అని ఇప్పటికే టాలీవుడ్ లో ముద్రపడిపోయాడు. హలోగురూ ప్రేమకోసమే సినిమా సెట్ లో అనుపమతో గొడవ జరిగింది అని గ్రేట్ ఆంధ్ర వెల్లడిస్తే,…

ప్రకాష్ రాజ్ అంటే కాస్త దుడుకు, లేదా షార్ట్ టెంపర్ అని ఇప్పటికే టాలీవుడ్ లో ముద్రపడిపోయాడు. హలోగురూ ప్రేమకోసమే సినిమా సెట్ లో అనుపమతో గొడవ జరిగింది అని గ్రేట్ ఆంధ్ర వెల్లడిస్తే, కాదని ట్విట్టర్ లో బుకాయించే ప్రయత్నం జరిగింది. ఆ తరువాత అది నిజమే అని తేలింది. అలాగే అదే సెట్ లో మాటల రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ విషయంలో కూడా ప్రకాష్ రాజ్ అనుచితంగా ప్రవర్తించినట్లు వెల్లడించాం. దానిమీద మరి మాట్లాడలేదు.

లేటెస్ట్ గా కమెడియన్ సప్తగిరిని ప్రకాష్ రాజ్ అందరి ముందుకొట్టాడని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయమై ఆరాతీస్తే వ్యవహారం వేరుగా వుంది. ఈ సంఘటన జరిగిపోయి చాలారోజులు గడిచినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ రెండున ఒకే ఒకరోజు సప్తగిరి ఆ సినిమాకు పనిచేసాడు. ఆ షూట్ కాచీగూడ రైల్వేస్టేషన్ లో జరిగింది. అక్కడే ఈ సంఘటన, అప్పుడే అంటే దాదాపు పాతిక రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది.

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రకాష్ రాజ్-సప్తగిరి కాస్త జిగినిదోస్త్ ల టైపు. ఇద్దరు కలిసారు అంటే షూటింగ్ లో మోటా జోకులు వేసుకుంటూ ఆనందిస్తారన్నది చాలామంది సినిమా జనాలు చెప్పేమాట. ఆరోజు కూడా అలాంటి టైమ్ లోనే,, ప్రకాష్ రాజ్ చేయి విసరడం, కూర్చుని వున్న సప్తగిరి లేవడమో, లేదా నిల్చుని వున్నవాడు కూర్చోడమో లాంటిది జరిగిందని, ఆ టైమ్ లో కాస్త గట్టిగానే చేయి తగిలిందని తెలుస్తోంది.

ఇది చాలా కాజువల్ గా జరిగిందని, నిజంగా కొట్టివుంటే తాను ఊరుకునే రకంకాదని, తను వదిలిపెట్టే రకం అస్సలు కాదని సప్తగిరి తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తొంది. పాతిక రోజుల క్రితం జరిగిన వ్యవహారం ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందో తెలియదట సప్తగిరికి. అయినా ప్రకాష్ రాజ్ కు ఇదే సరదానో?