ఒక సినిమాకు చాలా ఖర్చవుతుంది. కానీ సినిమాలో ఏదో ఒక పాయింట్ కీలకంగా వర్కవుట్ అవుతుంది. అది ఒక కమెడియన్ వర్క్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు. ఫిదాకు సాయిపల్లవి, గీతగోవిందం సినిమాకు వెన్నెల కిషోర్ ఇలా అన్నమాట. వాస్తవానికి ఆ పర్టిక్యులర్ వ్యవహారానికి తక్కువే ఖర్చవుతుంది. కానీ ఆ ఖర్చే టోటల్ సినిమాను ఆదుకుంటుంది.
ఇప్పుడు శైలజారెడ్డి అల్లుడు సినిమా కు కూడా అలాంటి వ్యవహారమే ఒకటి వుంది. ఈ సినిమాలో నాగచైతన్య హీరో కావచ్చు, మారుతి దర్శకుడు కావచ్చు. కానీ రమ్యకృష్ణ ది కీలకపాత్ర. బాహుబలి తరువాత రమ్యకృష్ణ స్క్రీన్ మీద కనిపించడం ఇదే.
అందువల్ల కచ్చితంగా ఆమె కూడా క్రౌడ్ పుల్లింగ్ పాయింట్ అవుతుంది. ప్రత్యేకించి ఫ్యామిలీలు, లేడీస్ కు. ఈ పాత్రకు గాను రమ్యకృష్ణకు ఇచ్చిన రెమ్యూనిరేషన్ కోటి రూపాయలు. అంటే దాదాపు టాప్ హీరోయిన్ రెమ్యూనిరేషన్ అన్నమాట.
కానీ ఆమెకు ఇచ్చిన కోటికి అంతకు అంతా ఇప్పటికే వచ్చేసిందట. హిందీ డబ్బింగ్ తదితర వ్యవహారాలు రమ్యకృష్ణ వుండడంతో కాస్త ఎక్కువే పలికాయి. అలాగే ఆమెనే సెంట్రల్ పాయింట్ గా, ఆమె మీదనే టైటిల్ పెట్టడంతో మార్కెట్ కూడా ఆ మేరకు పెరిగింది సినిమాకు.
ఏమైతేనేం కోటి ఇచ్చి రమ్యకృష్ణను ఒప్పించలేకపోయి వుంటే శైలజారెడ్డి అల్లుడు సినిమాకు ఇంత బజ్ అయితే వచ్చి వుండేది కాదు.