రెండు సినిమాలు సెట్ మీద వుండగానే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు బెల్లంకొండ హీరో శ్రీనివాస్. సినిమా హిట్ లు, యావరేజ్ లతో సంబంధం లేకుండా మార్కెట్ బాగుండడంతో, ఆఫర్లు బాగానే వున్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు తండ్రి బెల్లంకొండ ప్లానింగ్ తోడవుతోంది.
ఇప్పటికే వంశధార క్రియేషన్స్ కోసం కొత్త దర్శకుడితో ఓ సినిమా దాదాపు పూర్తికావచ్చింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తేజ డైరక్షన్ లో మరో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ రెండు సినిమాల్లో కాజల్ నే హీరోయిన్.
ఇప్పుడు మరో రెండు సినిమాలు ఓకె చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి అభిషేక్ పిక్చర్స్ ది వుంటుంది. మరోటి పెద్ద బ్యానర్ అని తెలుస్తోంది. ఒకదానికి కొత్త డైరక్టర్, రెండోదానికి పాపులర్ డైరక్టర్ ఒకరు పని చేస్తారని తెలుస్తోంది. ఈ రెండూ కూడా ఈ ఏడాది లోగానే ప్రారంభమవుతాయి.
ఇవికాక ప్రస్తుతం అయిదో సినిమా కోసం కథా చర్చలు సాగుతున్నాయి. ఈ లెక్కన వచ్చే ఏడాది చివరిలోగా అయిదు సినిమాలు పక్కాగా విడుదల చేసేలా వున్నాడు బెల్లంకొండ హీరో.