పులొచ్చింది..మేక చచ్చింది..అల వైకుంఠపురములో విడుదల టైమ్ లో ఫ్యాన్స్ వార్ లో విపరీతంగా చలామణీ అయిన వన్ లైనర్. అప్పట్లో మహేష్ ఫ్యాన్స్ కు బన్నీ ఫ్యాన్స్ కు మధ్య భలే హడావుడి జరిగింది.
కట్ చేస్తే మళ్లీ 'దాక్కో దాక్కో మేక..పులి వచ్చి కొరుకుతుంది పీక' అంటూ సాంగ్ ప్రోమో వదిలారు బన్నీ పుష్ప యూనిట్.
దాంతో మరోసారి పులి-మేక వ్యవహారం తెరమీదకు వచ్చింది. సంక్రాంతికి మరోసారి మహేష్ సినిమా వస్తోంది దానికి రెండు మూడు వారాలు ముందుగా బన్నీ సినిమా వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి వన్ లైనర్ మరోసారి రావడంతో ఫ్యాన్స్ దృష్టి అంతా అటు మళ్లింది.
కావాలనే ఇలాంటి లైన్ పదే పదే రాయిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది. అది ఎంత వరకు నిజమో కానీ 2020 జనవరిలో వున్న సంక్రాంతి సినిమాల ఫైట్ మళ్లీ 2022 లో రిపీట్ అయ్యేలా వుంది.