ఆయన ఓ పెద్ద ప్రొడ్యూసర్. అజాత శతృవు. నోట మాట వినపడదు. మంచివాడు. ఎవ్వరూ వేలెత్తి చూపలేరు. కానీ పాపం అలాంటి ఆయనకు కూడా ఓ లయబులిటీ వచ్చి పడింది. బాగా మొహమాటం వున్న సినిమా సీనియర్ టెక్నీషియన్ ఒకరు ఓ డైరక్టర్ యాస్పిరెంట్ ను పరిచయం చేసారు. వీలయితే ఓ చాన్స్ ఇచ్చి సినిమా చేసిపెట్టమన్నారు. దానికి ఈయన ఓకె అనేసారు.
రెండేళ్లు గడిచింది. సదరు డైరక్టర్ యాస్పిరెంట్ దగ్గర వున్న కథ పట్టుకుని, చాలా మంది హీరోలకు చెప్పించారు. ఎవ్వరూ ఒకె అనలేదు. రెండేళ్లు గడిచిపోయింది. ఇంత కాలం తమ దగ్గర అలా వుంచేసాం. మరెలా? అందుకే ఓ యంగ్ హీరోను తమ స్వంత బాధ్యత మీద ఒప్పించారు.
ఆ కథకు వాళ్ల చేత, వీళ్ల చేత వెర్షన్ ల మీద వెర్షన్ల రాయిస్తూనే వున్నారు. ఇంకా రాయిస్తున్నారు. అది కావాలి. దాన్ని తెరకెక్కించాలి. సినిమా ఓకె అనిపించుకోవాలి. హమయ్య, మాట ఇచ్చినందుకు నిలెబట్టుకున్నాం అనిపించుకోవాలి. ఇదీ ఆ 'పెద్దాయిన' కు లయబులిటీ. ఏమవుతుందో మరి.