రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు వుండరు. సినిమాల్లో కూడా మరీ ఇంత కాదు కానీ, పరిస్థితులను బట్టి ఒక్కోసారి ఇద్దరు సెలబ్రిటీల మధ్య రాజీ కుదురుతూ వుంటుంది. ఒక్కసారి మరీ పంతాలకు వెళ్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలాంటి గ్యాసిప్ ఒకటి వినిపిస్తోంది.
హీరో బన్నీ ఎప్పటికీ అనిల్ రావిపూడితో సినిమా చేయరు అన్నది ఆ గ్యాసిప్. దీనికి కారణం ఏమిటి అన్నది వినిపించడం లేదు కానీ బన్నీ మాత్రం ఏ స్టేజ్ లో కూడా అనిల్ రావిపూడితో సినిమా చేయను అని గట్టిగా ఫిక్స్ అయిపోయారని, ఈ మేరకు ఆయన సన్నిహితుల దగ్గర మాటల ప్రస్తావనలో బయటపడ్టారని వినిపిస్తోంది.
ఈ సంక్రాంతికి బన్నీ సినిమాకు పోటీగా మహేష్ సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో అనిల్ రావిపూడి కాస్త అగ్రెసివ్ గానే వెళ్లారు ఆయన సినిమా గురించి, మహేష్ గురించి చాలా అంటే చాలా మాట్లాడారు.
ఇవన్నీ బన్నీకి ఎందుకో నచ్చలేదని, ఎందుకో బన్నీ ఇరిటేట్ అయ్యారని వినిపిస్తున్నాయి. 'వరుస బ్లాక్ బస్టర్లు ఇచ్చినా మనం ఆయనతో చేసేది లేదు' అనే టైపులో బన్నీ తన సర్కిల్ జనాల దగ్గర అన్నారు అంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది.