సాధారణంగా టాలీవుడ్ జనాలు రాత్రంతా విదేశీ సినిమాలను కెలికేస్తూవుంటారు. ఎక్కడ ఓ లైన్ దొరుకుతుందా? అని. ఒక్కోసారి ఒక్కో లైన్ ను ఇద్దరు ముగ్గురు ఎత్తేస్తుంటారు. బేసిక్ లైన్ ను తీసుకుని, ఎవరి స్టోరీ వాళ్లు అల్లేసుకుంటూ వుంటారు.
ఆ మద్య అజ్ఞాతవాసి సినిమా టైమ్ లో అలాగే వినిపించింది. భరత్ అనే నేను కు కూడా ఆ లైన్ కాస్త కలిసిందని, అయితే అజ్ఞాతవాసి విడుదల టైమ్ లో కాస్త గడబిడ జరగడంతో కొరటాలశివ భరత్ అనే నేను విషయంలో కాస్త ముందుజాగ్రత్త పడ్డారని వార్తలు వినవచ్చాయి.
ప్రస్తుతం, శర్వానంద్ హీరోగా తయారవుతున్న సినిమా 'పడి పడి లేచె మనసు'. అలాగే సాయిధరమ్ తేజ హీరోగా తయారవుతున్న సినిమా ఒకటి వుంది. దీనికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ రెండు సినిమాలకు లైన్ ఒకటే అని వినిపిస్తోంది.
లైన్ ఒకటో కాదో అన్నది పక్కన పెడితే రెండూ ప్రేమ కథలే. ఇంతకీ వినిపిస్తున్న లైన్ ఏమిటంటే, హీరోయిన్ కు చిన్న షార్ట్ టెర్మ్ మెమరీ లాస్ లాంటి సమస్య ఏదో వుండడం. ప్రేమను మర్చిపోవడం అన్నది పాయింట్ గా వినిపిస్తోంది.
అంటే ఇన్నాళ్లు హీరోలకు కాన్సెప్ట్ లు, లోపాలు పెట్టడం అన్నది వుండేది. ఇప్పుడు అది తారాస్థాయికి వచ్చేసింది కాబట్టి, హీరోయిన్లకు లోపాలు పెడుతూ కథలు అల్లుతున్నారేమో? లేదా ఈ పాయింట్ ఏ కొరియన్ సినిమాలోనో, హాలీవుడ్ సినిమాలోనో టచ్ అయిందో? సినిమాలు విడుదలకు దగ్గరయితే, విషయాలు ఫూర్తిగా బయటకు వస్తాయి.