మేఘా ఆకాష్ తెలుగు సినిమాలకు నో?

మేఘా ఆకాష్. లై సినిమాతో తళుక్కున మెరిసిన యంగ్ బ్యూటీ. ఆ తరువాత మళ్లీ హీరో నితిన్ తోనే ఛల్ మోహన్ రంగ సినిమా చేసింది. ఈ రెండో సినిమా ప్రారంభమైనపుడే ఇండస్ట్రీలో గుసగుసలు…

మేఘా ఆకాష్. లై సినిమాతో తళుక్కున మెరిసిన యంగ్ బ్యూటీ. ఆ తరువాత మళ్లీ హీరో నితిన్ తోనే ఛల్ మోహన్ రంగ సినిమా చేసింది. ఈ రెండో సినిమా ప్రారంభమైనపుడే ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. మేఘా-నితిన్ ఇద్దరు ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ ఇద్దరి  వైపు నుంచి సమర్ధన రాలేదు. అలా అని ఖండనా రాలేదు.

చిత్రంగా మేఘాకు మరో సినిమా ఏదీ రాలేదు. కానీ హీరోలే రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి నితిన్ పక్కన తప్ప వేరే వాళ్ల పక్కన మేఘా నటించదు అన్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో బలంగా అలుముకున్నాయి. హీరోయిన్ల కొరత వున్నా కూడా అందుకే ఆమెను తీసుకోవడం లేదని కొందరు నిర్మాతలు అంటున్నారు.

నితిన్ సన్నిహితుడు, స్నేహితుడు అఖిల్ సరసన వేయడానికి ముందు మేఘా ఓకె అన్నది కానీ మళ్లీ నో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ నో అంటోంది. హీరోయిన్ మా హీరో పక్కన చేయనంటోంది అని చెప్పుకోవడానికి బాగోదు కాబట్టి, రివర్స్ లో మా హీరోనే రిజెక్ట్ చేసాడు అని ఫీలర్లు వదులుతున్నారు.

ప్రస్తుతం మేఘా తమిళంలో ఒకటి రెండు సినిమాలకు మాత్రమే సైన్ చేసింది. తెలుగులో మాత్రం మరి ఇక సినిమాలు ఇప్పట్లో చేయదనే వినిపిస్తోంది. నితిన్ తో వ్యవహారం ఏమన్నా తేడా వస్తే, అప్పుడు మళ్లీ సినిమాలకు ఓకె అంటుందేమో? కానీ అప్పటికి సమయం మించిపోవచ్చు.