యంగ్ హీరోలో చాలా మంది నడుట ఆఫ్ ది స్క్రీన్ ఫ్రెండ్ షిప్ బోలెడు వుంది. కాంపిటీషన్ అంతా ఆన్ స్క్రీన్ మాత్రమే. అందుకే ఒకరికి ఒకరు అవసరమైన సాయం చేసుకుంటూ వుంటారు. ఇప్పుడు చరణ్ కూడా కూడా అలాగే నితిన్ సినిమా కొరియర్ బాయ్ కళ్యాణ్ ను గట్టెక్కించాడని వినికిడి.
చివరి నిమిషం వరకు కొరియర్ బాయ్ కు సమస్యలు ఎదురయ్యాయని, చరణ్ మాట సాయం చేసి, విడుదలకు మార్గం సుగమం చేసాడని టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సాయం చేసింది, తనతో సినిమా చేయాలనే ప్రయత్నంలో వున్న గౌతమ్ మీనన్ కోసమా లేదా, నితిన్ కోసమా అన్నది తెలియదు.
గౌతమ్ మీనన్ ఎలాగైనా మాంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీని చరణ్ తో తెరకెక్కించాలనే ప్రయత్నంలో వున్నాడు. లైన్ చెర్రీకి నచ్చింది. కానీ ఆ ప్రాజెక్టు నెంబర్ ఎంత అన్నదే తెలియదు. ధని ఒరువన్ ను చరణ్ చేసే పక్షంలో బ్రూస్ లీ తరువాతి ప్రాజెక్టు అదే అవుతుంది. అది కాకపోతే మాత్రం గౌతమ్ మీనన్ సినిమా వుంటుంది. థని ఒరువన్ ను సురేందర్ రెడ్డికి అప్పగించాలన్న ఆలోచన ఇంకా ఓ కొలిక్కి రాలేదని వినికిడి.