ఏషియన్ గ్రూప్ తో కలిసి మహేష్ బాబు మల్టీప్లెక్సు వ్యాపారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వెంచర్ కు AMB సినిమాస్ అనే పేరుపెట్టారు. ఇప్పుడు దీనికి పోటీగా త్వరలోనే AAA సినిమాస్ అనే మరో మల్టీప్లెక్స్ చైన్ రాబోతోంది. అవును.. మహేష్ బాబుతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన అదే గ్రూప్, అల్లు అర్జున్ తో కలిసి మరో మల్టీప్లెక్స్ ప్రారంభించబోతోంది.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పురాతన సత్యం థియేటర్ ను అల్లు అర్జున్, ఏషియన్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఇక్కడ భారీ మల్టీప్లెక్సు ఏర్పాటుచేయబోతోంది. దీనికి AAA సినిమాస్ అనే పేరు కూడా ఫిక్స్ చేశారు. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
డబ్బులు పెట్టేది అల్లు అర్జున్ అయినప్పటికీ పేరు మాత్రం అల్లు అరవింద్ దేనని తెలుస్తోంది. అవును.. AAA అంటే ఏషియన్ అల్లు అర్జున్ కాదు, ఏషియన్ అల్లు అరవింద్ సినిమాస్ అంట. ఈ మేరకు రాతకోతలు పూర్తయినట్టు టాక్.
ఇప్పటికే పలు వ్యాపారాల్లోకి ఎంటరయ్యాడు అల్లు అర్జున్. గీతాఆర్ట్స్ కాకుండా త్వరలోనే మరో సొంత బ్యానర్ పెట్టి దానిపై సినిమాలు కూడా తీస్తాడనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు దీనికి అదనంగా ఈ మల్టీప్లెక్ట్ బిజినెస్ కూడా. నిజానికి అమీర్ పేట్ లో మల్టీప్లెక్సు కట్టి ఊరుకుందామనుకున్నారు కానీ మహేష్ బాబుని చూసిన తర్వాత బన్నీకి కూడా రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్ చైన్ ఏర్పాటుచేయాలనే కోరిక కలిగిందట.