అయ్యో సైరా.. అందరూ ఒకేలా ఉన్నారేంటబ్బా!

స్వతంత్రానికి ముందు మనుషులంతా మీసాలు, గడ్డాలు బాగా పెంచేవారా? భుజాల వరకు జుట్టు పెంచేవారా? వందేళ్ల కిందట భారతీయులకు గడ్డం గీసుకోవడం కూడా తెలీదా? మనుషులంతా ఇంతేనా లేక కేవలం రాజరికంలో ఉండే వ్యక్తులు…

స్వతంత్రానికి ముందు మనుషులంతా మీసాలు, గడ్డాలు బాగా పెంచేవారా? భుజాల వరకు జుట్టు పెంచేవారా? వందేళ్ల కిందట భారతీయులకు గడ్డం గీసుకోవడం కూడా తెలీదా? మనుషులంతా ఇంతేనా లేక కేవలం రాజరికంలో ఉండే వ్యక్తులు మాత్రం ఇలా నిండుగా గడ్డాలు మీసాలు పెంచేవారా? సైరా సినిమా ఫస్ట్ లుక్స్ చూస్తే ఇదే అనుమానం కలగకమానదు.

ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు చాలా ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. అందరిదీ ఒకటే గెటప్, అందరికీ ఒకటే మేకప్. ముందుగా బర్త్ డే సందర్భంగా చాన్నాళ్ల కిందటే చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పొడవాటి జులపాలతో, దట్టమైన గడ్డంతో భలే ఉన్నాడే అనుకున్నారంతా. ఆ లుక్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

కట్ చేస్తే  సుదీప్ లుక్ విడుదల చేశారు. ఇది కూడా సేమ్ టు సేమ్. అదే హెయిర్ స్టయిల్, అదే గడ్డం, అదే మీసం. చేతిలో ఆయుధం, క్యారెక్టర్ పేరు మాత్రమే మారింది. పోనీలే అని సరిపెట్టుకునేలోపే విజయ్ సేతుపతి లుక్ విడుదల చేశారు. ఇక్కడ కూడా మళ్లీ పాత కథే.

విజయ్ సేతుపతి పాత్రకు కూడా మళ్లీ పొడవాటి జుట్టు, మీసం, గడ్డం పెట్టేశారు. ఉన్నంతలో చిరంజీవి, సుదీప్ తో పోలిస్తే గడ్డం సైజ్ కాస్త తగ్గించారంతే. ఇలా చిరంజీవితో పాటు కీలక పాత్రలన్నీ సేమ్ మేకోవర్ తో ఉంటాయని అనుకునేలోపే జగపతిబాబు లుక్ కూడా రిలీజ్ చేశారు.

ఇక్కడ కూడా కొత్తగా చెప్పుకోవడానికి ఏంలేదు. గడ్డం, మీసం, జుట్టు, మేకప్.. అంతా కామన్. ఇలా చెప్పుకుంటూపోతే సైరాలో కీలక పాత్రలన్నీ ఒకేలా కనిపిస్తాయేమో అనిపిస్తోంది. చివరికి రాజగురువు అమితాబ్ బచ్చన్ పాత్రలో కూడా వైవిధ్యం చూపించలేకపోయారు. చిరు, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు జాబితాలోకి బిగ్ బిని కూడా చేర్చేశారు.

పచ్చ కోటలు బీటలు వారుతున్నాయా..?!