Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అ..ఆ..అనుపమ..అసంతృప్తి?

అ..ఆ..అనుపమ..అసంతృప్తి?

అ..ఆ  సినిమా అందరికీ ఆనందాన్ని పంచింది. నిర్మాత దర్శకులు, బయ్యర్లకు అయితే అసలు ఊహించని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ఇచ్చింది. అయితే ఒకే ఒక్కరు హ్యాపీ గా లేరట. అదే  ఆ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ మళయాల సినిమాతో మాంచి పేరు తెచ్చుకుంది. తెలుగు ప్రేమమ్ లో కూడా ఆమెనే ఫైనల్ చేసారు. అదే ఆమె తొలి తెలుగు సినిమా అయి వుండేది. 

కానీ అ..ఆ, ప్రేమమ్ సినిమాలు రెండింటికి నిర్మాత ఒకరే కావడంతో, బ్యానర్ సినిమా వ్యవహారాలన్నింటితో త్రివిక్రమ్ కు అంతో ఇంతో సాన్నిహిత్యం వుండడంతో అనుపమ పరమేశ్వరన్ ను అ..ఆ లో రోల్ కూ తీసుకుంటే బాగుంటుందన్న అయిడియా వచ్చింది. త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుడు అడగడంతో ఆమె కూడా వెంటనే ఓకే అనేసింది. 

నిజానికి ప్రేమమ్ కు ఆమెను ఫిక్స్ చేసినప్పటికి ఈ ఆలోచన లేదు. ఇదిలా వుంటే ఇప్పుడు అ..ఆ లో తన పాత్ర చూసకుని అనుపమ పరమేశ్వరన్ చాలా పీలయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె నేరుగా దర్శకుడు త్రివిక్రమ్ నే అడిగినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మీరు నెరేట్ చేసిన కథేమిటి? తీసిన దాంట్లో తన పాత్ర ఏమిటి? అని అడిగినట్లు తెలుస్తోంది. 

అంతే కాదు, తనకు రావు రమేష్ కు మధ్య చిత్రీకరించిన ఓ సీన్ ను కూడా గుర్తు చేసి, ఎందుకు తీసేసినట్లు అని నిలదీసినట్లు తెలుస్తోంది. నిడివి సమస్య వచ్చిందని త్రివిక్రమ్ సర్దిచెప్పినట్లు బోగట్టా. అనుపమ కెరీర్ కు తన వంతు సాయం వంటుందని త్రివిక్రమ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద అ..ఆ అందరికీ ఆనందాన్ని పంచినా అనుపమకు అసంతృప్తే అందించిందినట్లుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?