cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ఆలియాకు అందినది అయిదుకోట్లు

ఆలియాకు అందినది అయిదుకోట్లు

ఆలియా భట్ క్రేజ్ ఎంత అన్నది సినిమా అభిమానులకు తెలిసిందే. అందుకే దర్శకుడు రాజమౌళి ఆమెను తన మల్టీస్టారర్ లోకి తీసుకుని, ఆ సినిమాకు బాలీవుడ్ మార్కెట్ ను తెచ్చుకున్నారు. లేదూ అంటే చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ బాలీవుడ్ మార్కెట్ సరిపోదు. అయితే ఆలియా భట్ ను ఒప్పించడం వరకు ఒకె. ఎంత రెమ్యూనిరేషన్ అన్నది బయటకు రాలేదు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆలియాభట్ రెమ్యూనిరేషన్ అయిదు కోట్లు అని తెలుస్తోంది. ఆమె టీమ్ ఖర్చులు, ట్రాన్స్ పోర్ట్, హోటల్, ఇవన్నీ ఈ అయిదు కోట్లకు అదనం. అయితే ఆలియాను తీసుకుంటే, కచ్చితంగా బాలీవుడ్ లో అంతకు అంతా క్రేజ్ వస్తుంది రిటర్న్ వస్తుంది. అందుకే కిందామీదా పడి ఒప్పించి తీసుకున్నారు. 

ఈ విషయంలో రాజమౌళి సన్ కార్తీకేయ దే క్రెడిట్ అంతా. బాలీవుడ్ లో అతగాడు, రానాకు వున్న స్నేహ సంబంధాలు అన్నీ వాడి ఆలియాను ఒప్పించారు. ఆ విధంగా తెలుగు ఎంట్రీ సాధ్యమైంది.

ఒపీనియన్ కోసం నేను చిరంజీవిగారిని వెళ్లి అడిగాను