బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న రీమేక్ సినిమా రాక్షసుడు. ఈ సినిమా తమిళ సినిమా రాక్షసన్ కు రీమేక్. ఈ సినిమాను జస్ట్ ముఫై నుంచి నలభై వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేస్తారని, చాలా మీడియం బడ్జెట్ లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను అవుట్ రేట్ గా ఫస్ట్ కాపీని అభిషేక్ పిక్చర్స్ కొనుగోలు చేసింది. వరల్డ్ వైడ్ థియేటర్, డిజిటల్, శాటిలైట్ అన్నీకలిపి 20 కోట్ల రేంజ్ లో కొన్నట్లు బోగట్టా.
ఇంతకీ ఈ సినిమా వెనుక వున్న అసలైన సీక్రెట్ ఏమిటంటే, తమిళ సినిమాలో సగం పార్ట్ ను దాదాపుగా తెలుగులో వాడేయడం. ఈ మేరకు రీమేక్ రైట్స్ కొన్నపుడే డిసైడ్ చేసి, అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. అంటే హీరో హీరోయిన్లు కాకుండా, వాళ్లు లేకుండా వున్న సీన్లు అన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా కట్ పేస్ట్ చేస్తారన్నమాట. డబ్బింగ్ సినిమా మాదిరిగా.
హీరో హీరోయిన్లు లేకుండా వున్న సీన్లు అన్నీ సెపరేట్ చేసి, వాటిల్లో వున్న యాక్టర్లతో కాంబినేషన్ సీన్లు కనుక వుంటే వాళ్లనే తెలుగుకు కూడా తీసుకుని, ప్లాన్డ్ గా సెట్ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. సినిమా వేగం పూర్తవుతుంది. అన్నింటికి మించి డైరక్షన్ ఈజీ అవుతుంది. ప్లాన్ బాగుందిగా.