అమీర్ పై బీజేపీ ఆగ్రహం తగ్గిపోయిందా?

ఇంక్రెడిబుల్ ఇండియా నుంచి తప్పించారు.. స్వచ్ఛభారత్ విషయంలో ప్రమోషన్ కు కూడా ఆయనను వద్దన్నారు.. ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించిన స్వచ్ఛభారత యోధుల పేర్ల జాబితా నుంచి ఆయనను తొలగించారు… దేశంలో అసహనం గురించి ఆమిర్…

ఇంక్రెడిబుల్ ఇండియా నుంచి తప్పించారు.. స్వచ్ఛభారత్ విషయంలో ప్రమోషన్ కు కూడా ఆయనను వద్దన్నారు.. ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించిన స్వచ్ఛభారత యోధుల పేర్ల జాబితా నుంచి ఆయనను తొలగించారు… దేశంలో అసహనం గురించి ఆమిర్ చేసిన వ్యాఖ్యనాల ఫలితంగా పై పరిణామాలు సంభవించాయనేది అందరికీ తెలిసిన విషయమే. మరి బీజేపీ ఆధ్వర్యంలోని మోడీ సర్కారు ఆమిర్ ను అలా పక్కన పెట్టేయగా… మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉన్నట్టుండి ఆమిర్ ను తమ కార్యక్రమంలో భాగస్వామ్యుడిని చేసింది.

ప్రజల్లో నీటి వినియోగం గురించి అవగాహన నింపేందుకు చేపట్టిన ప్రచార కార్యక్రమాల విషయంలో ఒకానొక అంబాసిడర్ గా నియమితుడయ్యాడు ఆమిర్. మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఒకవైపు ఆమిర్, షారూక్ లపై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.దేశంలో అసభనం ప్రబలిందన్న వారికి అసహనం రుచి అంటే ఎలా ఉంటుందో చూపుతున్నారు కాషాయధారులు.

వీళ్ల ఇగో శాటిస్ ఫై అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమిర్ అవసరం లేదని తేల్చి చెప్పింది. కానీ.. ఉన్నట్టుండి మహారాష్ట్ర సర్కారు మాత్రం మళ్లీ ఆమిర్ కు అంబాసిడర్ హోదా ఇచ్చింది. ఆమిర్ విషయంలో ఈ లెక్కలు ఎందుకు మారాయో.. ఈ పరిణామాలపై ప్రాచీలు, సాధూలు ఊరికే ఉంటారా? ఫడ్నవీస్ పై మండి పడతారా?