Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ రూమ్ ను త్రివిక్రమ్ వదల్లేదు

ఆ రూమ్ ను త్రివిక్రమ్ వదల్లేదు

డైరక్టర్ త్రివిక్రమ్..హీరో సునీల్ ల అపూర్వ స్నేహం సంగతి తెలిసిందే.ఇద్దరూ కలిసి దాదాపు 15 ఏళ్లు ఓకే గదిలో వున్నారు. అప్పుడు జస్ట్ వెయిటింగ్ ఫర్ ఛాన్స్. బైక్ పై తిరుగుతూ, వన్ బై టూ చాయ్ లు తాగుతూ, డిస్కషన్లు చేసుకుంటూ గడిపేసిన రోజులు. ఇప్పుడు ఇద్దరి స్టేజ్ మారిపోయింది. త్రివిక్రమ్ టాప్ డైరక్టర్ అయిపోయారు. సునీల్ హీరోగా ప్రూవ్ చేసుకుని, నిలదొక్కుకునే ప్రయత్నంలో వున్నారు. 

ఇప్పుడు సునీల్ కు స్వంత ఇల్లు వుంది.త్రివిక్రమ్ కూ వుంది. పైగా త్రివిక్రమ్ ఎక్కువగా కాస్ట్లీ హోటల్ అయిన పార్క్ హయాత్ లోని సర్వీస్ అపార్ట్ మెంట్ లో వుంటారని వినికిడి. అయినా కూడా పాత రోజులు మర్చిపోలేదు. ఆ నాటి ఆ స్నేహమానంద గీతం..అంటూ పాడుకుంటూనే వున్నారు. అది కూడా ఎక్కడనుకున్నారు..ఆ పాత గదిలోనే. 

పంజాగుట్టలోని బాబా టెంపుల్ కు సమీపంలోని ఆ గదిని వారు మరిచిపోలేదు. ఇప్పటికీ దాన్ని వారి కిందే వుంచుకుని అద్దె చెల్లిస్తున్నారు. ఇద్దరికి కుదిరినపుడల్లా ఓసారి అక్కడకు వెళ్లి, ఓ గంట మాట్లాడుకుని వస్తుంటారట. మై ఆటోగ్రాఫ్..స్వీట్ మెమరీస్ అంటే ఇదే నేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?