నటి ఆర్తి అగర్వాల్ మృతికి కీలక కారణం లావు తగ్గడానికి లైపో సక్షన్ చేయించుకోవడమే అని వార్తలు వెలువడ్డాయి. ఆమె ఆసుపత్రిలో మరణించింది అంటూ ఫొటోలు కూడా వచ్చాయి. అయితే వాస్తవాలు ఇవేనా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఆర్తీ కొద్ది రోజుల క్రితమో, నెలల క్రితమో హైదరాబాద్ లోనే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకునట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆమె ఓ సంస్థకు బాండ్ అంబాసిడర్ గా వున్నారు. ఆ సంస్థ కూడా ఇలాంటి సర్జీరీలు, వెయిట్ రిడక్షన్ ట్రీట్ మెంట్ లు చేస్తుంది. కొన్నాళ్ల క్రితం ఆర్తి ఆ సంస్థ తరపున ప్రచారం చేస్తూ, తాను ఇంత బరువు తగ్గాను అని ప్రకటనలు ఇచ్చింది. మరి ఆ సంస్థలోనే ఆమె బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుందా లేక వేరే చోటా అన్నది తెలియడం లేదు.
ఇక్కడ పాయింట్ ఏమిటంటే, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తరువాత మళ్లీ లైపో సక్షన్ చేయించుకోవడం అన్నది కరెక్ట్ కాకపోవచ్చని కొందరు అంటున్నారు. పైగా ఆర్తి ఆసుపత్రిలో మరణించలేదని, ఆసుపత్రికి తీసుకెళ్తుండగా, అక్కడకు చేరేసరికి మరణించిందని కూడా వార్తలు వినవస్తున్నాయి. మరి ఏది నిజమో?