‘ఆవిడ’కు మందెక్కువైంది?

మందు బాబులే కాదు.. మందు భామలు కూడా వుంటారు. అది కల్చర్ కూడా ఇప్పుడు. ఎంత మాత్రం తప్పు కాదు అన్నదే పేజీ 3 కల్చర్. అయితే కిక్కు ఎక్కేదాకా తాగడం వేరు. కక్కు…

మందు బాబులే కాదు.. మందు భామలు కూడా వుంటారు. అది కల్చర్ కూడా ఇప్పుడు. ఎంత మాత్రం తప్పు కాదు అన్నదే పేజీ 3 కల్చర్. అయితే కిక్కు ఎక్కేదాకా తాగడం వేరు. కక్కు వచ్చేదాకా తాగడం వేరు. ఈ రెండో దానితోనే తంటా.

లేటెస్ట్ గా వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే ఒకటి రెండురోజుల క్రితం ఓ సినిమా పార్టీ జరిగింది. ఓ చిన్న సినిమాకు సంబంధించి డైరక్టర్-నిర్మాత ఎక్సెట్రా.. ఎక్సెట్రా కలిసి పార్టీ చేసుకున్నారు. ఇది కామన్. ఈ పార్టీలో ఓ గ్లామరస్ క్యారెక్టర్ నటి కూడా పాల్గొన్నారని తెలుస్తోంది.

పనిలో పనిగా కాస్త గట్టిగా మందు పుచ్చుకున్నారని, అది అలా ఆమెకు పూర్తి స్థాయిలో కిక్ ఎక్కే రేంజ్ కు వెళ్లిపోయిందని, తన పర్సనల్ స్టాఫ్ సాయంతో ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.  అందమైన ఆంటీలు అలా అలా సుతారంగా పెగ్ చేతితో పట్టుకుంటే అందంగా వుండెచ్చేమో కానీ, అంతలా తాగి పడిపోతే మాత్రం అసహ్యంగా వుంటుందేమో?

జగన్ గెలుపు వాళ్లకి నచ్చలేదు..