త్రివిక్రమ్ సైలెంట్ వర్క్

ఒకపక్క అల వైకుంఠపురములో సినిమా చేస్తూనే, దర్శకుడు త్రివిక్రమ్ తన స్నేహితుడు, సన్నిహితుడు పవన్ కళ్యాణ్ కోసం సైలంట్ గా వర్క్ చేసేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. తమిళ సినిమా పింక్ రీమేక్ కు…

ఒకపక్క అల వైకుంఠపురములో సినిమా చేస్తూనే, దర్శకుడు త్రివిక్రమ్ తన స్నేహితుడు, సన్నిహితుడు పవన్ కళ్యాణ్ కోసం సైలంట్ గా వర్క్ చేసేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. తమిళ సినిమా పింక్ రీమేక్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు, హారిక హాసిని, బోనీ కపూర్ ల భాగస్వామ్యంలో నిర్మిస్తారు.

క్రిష్-ఎ ఎమ్ రత్నం కాంబినేషన్ లో నిర్మించే సినిమాను చేస్తూనే, పింక్ రీమేక్ కూడా సమాంతరంగా చేసే అవకాశం వుందని తెలుస్తోంది. పింక్ రీమేక్ కు డైరక్టర్ సెట్ కాలేదు కానీ త్రివిక్రమ్ మాత్రం బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసేస్తున్నట్లు బోగట్టా. క్రిష్ సినిమా కాస్త పెద్ద సినిమా కావడంతో, ముందుగా పింక్ రీమేక్ నే విడుదలయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.

త్రివిక్రమ్ తయారుచేసే బౌండ్ స్క్రిప్ట్ ను ఎవరిచేతిలో పెడతారో అన్న సంగతి తేలితే మిగిలినవన్నీ ఫైనల్ అయిపోతాయి. మొత్తంమీద జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ సినిమా రీఎంట్రీ ఫిక్స్ అయిపోయినట్లే. జనం కోసం సినిమాలు వదిలేసాను అని చెప్పిన పవన్ మళ్లీ తూచ్ అనేసి సినిమాల్లోకి వచ్చేస్తున్నారు.

జగన్ గెలుపు వాళ్లకి నచ్చలేదు..