ఆర్టిస్ట్ కమ్ డైరక్టర్ రవిబాబు ఓ చిత్రమైన ఫిలిం మేకర్. అందరూ నడిచే దారిలో అస్సలు నడవడు. మేకింగ్ కావచ్చు, సినిమా కావచ్చు, ప్రచారం కావచ్చు అంతా వేరు. ఆయన రూటే సెపరేటు. లేటెస్ట్ గా ఆవిరి అనే ఓ చిన్న సినిమా తీసి విడుదలకు రెడీ చేసాడు. దాని ప్రచారం ఇటీవలే ప్రారంభించాడు.
గతంలోని సినిమాలకు చేసినట్లే ఈసారి కూడా ఒకటే స్టిల్ పట్టుకుని, దాంతోటే చిత్ర విచిత్ర ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను శనివారం విడుదల చేయబోతున్నారు.
ఏ సినిమాకు అయినా ఒకటే టీజర్ వుంటుంది. కానీ రవిబాబు తన ఆవిరి సినిమాకు మూడు టీజర్లు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం లోగా నాలుగేసి గంటల గ్యాప్ లో మూడు టీజర్లు వదులుతారు అన్నమాట.
వాస్తవానికి మూడు టీజర్లు కలిపితే ఒకటే టీజర్ అవుతుంది. కానీ ఒకటే టీజర్ ను మూడు చోట్ల కట్ చేసి, మూడు భాగాలుగా వదలబోతున్నారు అన్నమాట. అదో వెరైటీ. చూడాలి ఈ మూడు ముక్కల టీజర్ ఎలా వుండబోతోందో?