తెలుగువాళ్ళకు తాగుబోతు పాత్రలపై అసహ్యం కలగకుండా అభిమానం ఏర్పడేలా నటించిన గొప్ప కమెడియన్ ఎంఎస్ నారాయణ. ఆయన లేని సినిమాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. బ్రహ్మానందంతోపాటు ఎంఎస్ నారాయణ కూడా తమ సినిమాలో వుండే కామెడీతో కడుపు చెక్కలవ్వాల్సిందే.
ఇంకా ఎన్నో పాత్రలు పోషించాల్సిన ఎమ్మెస్ నారాయణ తొందరగా వెళ్ళిపోవడంతో రచయితలు ఆయన పాత్రని ఇంకెవ్వరికీ కట్టబెట్టాలన్నా సరైన నటుడు దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్నారట. కథని ప్రిపేర్ చేసేటప్పుడు ఇప్పటికి కూడా ఇది ఎంఎస్ నారాయణ పాత్ర అనుకోండి.. అని కథ చెబుతున్నారంటే ఆయన ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఆయన తాగాల్సిన మందు ఈ భూమ్మీద ఇంకా ఎంతో మిగిలి వుందిగానీ తాగడానికి ఆయన లేడు.. అని ఒక సినీ రచయిత అనడం విశేషం. ఎమ్మెస్ కూడా అప్పుడప్పుడూ జోక్ చేస్తుండేవాడట.. ఈ భూమ్మీద అన్నీ నాశనమైపోతే మీరంతా చచ్చిపోతారు. నేనొక్కడినే మందు తాగి కొన్నాళ్ళు బతకగలనని అలాంటి టైమింగ్ వున్న నటుడు తెలుగు పరిశ్రమకు ఎన్నో ఏళ్ళకుగానీ దొరకడు. దొరక్కపోయినా ఆశ్చర్యం లేదు.