సభ్యతకూ అసభ్యతకూ ఒక్క అక్షరమే తేడా. ఏది ఎక్కువైనా, తక్కువైనా జనం గగ్గోలు పెట్టేస్తారనడానికి ఉదాహరణగా సెక్సీ యాంకర్ రేష్మిని చెప్పుకోవచ్చు. రేష్మి యాంకరింగ్ చేస్తున్న జబర్దస్త్ ప్రోగ్రామ్ ఇప్పటికీ హిట్ రేంజ్లో నడుస్తుంది. ఈ ప్రోగ్రామ్లో రేష్మి మరీ విలువలు లేకుండా వలువలు కట్టుకుంటుందని చాలామంది అనుకుంటుండడంతో నిజమే కాబోలనుకుని రేష్మి నిండగా చీర కట్టుకుని కనిపిస్తుండడం మరో వర్గం ప్రేక్షకులకు నచ్చడంలేదట.
అస్సలు మేం ప్రోగ్రామ్ చూస్తుందే రేష్మి కోసం. అలాంటి సెక్సీ యాంకర్ ముసలమ్మలా తెల్ల చీరలు కట్టుకుని రావడం నచ్చడంలేదని వాపోతున్నారట. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. ప్రొడ్యూసర్స్ ఎలాంటి డ్రెస్సులు వేసుకోమంటే, అవే వేసుకుంటాను. బహుశా నామీద వచ్చిన విమర్శలకు వాళ్ళు జాగ్రత్తపడుతున్నారేమో వెళ్ళి వాళ్ళనే అడగండి.. అని చెబుతుంది రేష్మి.
ఇటు రేష్మి చీరలు కట్టుకుని, అటు రోజా కూడా చీరలు కట్టుకుంటే ప్రోగ్రామ్లో మజా ఏం వుంటుంది? జబర్దస్త్ ప్రోగ్రామ్లో కూడా చాలామంది మగాళ్ళు చీరలు కట్టుకునే పైకొచ్చారు. పాపం రేష్మి లాంటి యంకర్స్కి ఇబ్బందే మరి. కట్టుకోనివ్వరూ.. విప్పుకోనివ్వరూ.. స్కిట్స్లో ఫన్ తగ్గిపోతుంది కాబట్టి రేష్మి ఇక తన గ్లామర్ చూపించే ఆ ప్రోగ్రామ్ని రక్షించాల్సి వుంటుంది మరి.