అభిమానులకు ఇచ్చే గౌరవం ఇదేనా?

మెగాస్టార్ అండ్ బ్రధర్స్.. రిలెటివ్స్… స్టేజ్ ఎక్కితే ఎంత గొప్పగా మాట్లాడుతారో..’ మనది ఒకే కుటుంబం… మెగా కుటుంబం.. మీరు లేకుంటే మేం లేము.. మీ వల్లే ఇంతవాళ్లమయ్యాం..’ ఇలా రకరకాలుగా.. నిజానికి అవన్నీ…

మెగాస్టార్ అండ్ బ్రధర్స్.. రిలెటివ్స్… స్టేజ్ ఎక్కితే ఎంత గొప్పగా మాట్లాడుతారో..’ మనది ఒకే కుటుంబం… మెగా కుటుంబం.. మీరు లేకుంటే మేం లేము.. మీ వల్లే ఇంతవాళ్లమయ్యాం..’ ఇలా రకరకాలుగా.. నిజానికి అవన్నీ నిజాలే. మెగాస్టార్ ను కానీ ఆ కాంపౌండ్ నుంచి ఎవరు వచ్చినా, మెగాభిమానులు గుండెల్లో పెట్టేసుకుంటారు. వారి కోసం కిందా మీదా పడిపోతారు. వాళ్లను ఎవరైనా మాట అంటే విరుచుకు పడిపోతారు. అలాంటి ఫ్యాన్స్ ను మెగా కుటుంబం ఎలా వాడుకుంటుందో.. వింటుంటే.. పాపం.. అభిమానులు అనిపిస్తుంది.

అసలు ఇంతకీ విషయం ఏమిటంటే..మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ పెళ్లి బెంగుళూరులో జరుగుతోంది. దీనికి కీలకమైన ఫ్యాన్స్ ను అయినా పిలుస్తారేమో అనుకున్నారు. కానీ వ్వవహారం వేరుగా వుంది. ఇంకా చెప్పాలంటే భలే చిత్రంగా వుంది. అదెలా అంటే..

కీలకమైన కొంత ఫ్యాన్స్ కు లాస్ట్ మినిట్ లో బెంగుళూరు వచ్చేయమని వర్తమానం అందింది. ఎవరి ఖర్చులు వారు పెట్టుకుని వెళ్లారు. అక్కడ రూమ్ లు కేటాయించారు. కానీ అక్కడే వుంది ట్విస్టు..ఎవరూ బయటకు రానక్కరలేదు. వెన్యూ దగ్గరకు అస్సలు రాకూడదు..సెలబ్రిటీలు తప్ప పెళ్లిలో ఫ్యాన్స్ వుండకూడదు..ఇదీ అంతర్గత ఆర్డరు..అని విశ్వసనీయవర్గాల బోగట్టా. మరెందుకు రమ్మనడం అంటే….ఏదైనా పని చేయాలంటే..అవసరం పడితే…అప్పుడు అక్కడ ఎవరుంటారు? అందుకే రూమ్ లు తీసారు. ఫ్యాన్స్ ను వాటిల్లో వుంచారు..అవసరమైతే వారిని వాడతారు..లేదంటే వెనక్కు వెళ్తారు..అదీ స్ట్రాటజీ.

అంటే అభిమానులు అంటే రిజర్వ్ దళం లా అలా వుండాలన్నమాట. అంతే కానీ పెళ్లికి రాకూడదన్నమాట..ఆ మాత్రం దానికి పిలడం ఎందుకో అని ఫ్యాన్స్ వారిలో వారు ఫీలవుతున్నారు. ఫ్యాన్స్ ముఖ్యనాయకుడు ఒకరు కూడా ఇదే విధంగా ఫీలవుతున్నారని వినికిడి. చిరంజీవి గతంలో లా లేరని తరచు చిరాకు పడుతున్నారని..సన్నిహితులతో చెప్పుకుని ఫీలవుతున్నారట. మొత్తం మీద బ్రూస్ లీ ఎఫెక్ట్ ఇదంతా అంటున్నారు టాలీవుడ్ జనాలు.