Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాహో టీజర్.. ఈసారి కూడా అంతా దుబాయ్

సాహో టీజర్.. ఈసారి కూడా అంతా దుబాయ్

సాహో సినిమాకు సంబంధించి మొదట్నుంచి దుబాయ్, అబుదాబిలో తీసిన సన్నివేశాల చుట్టూనే ప్రచారం సాగుతోంది. ఫస్ట్ లుక్స్ నుంచి షేడ్స్ ఆఫ్ సాహో పేరిట విడుదల చేసిన మేకింగ్ షాట్స్ వరకు అన్నీ ఈ షెడ్యూల్ లోనివే. ఇప్పుడు టీజర్ లో కూడా అవే సన్నివేశాలు కనిపించబోతున్నాయి.

సాహో టీజర్ రెడీ అయింది. ఈరోజు ఉదయం సరిగ్గా 11 గంటల 23 నిమిషాలకు విడుదల కానున్న ఈ టీజర్ లో దుబాయ్, అబుదాబి షెడ్యూల్స్ కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలకే ప్రాధాన్యం ఇచ్చారు. సినిమా కథ, హీరో క్యారెక్టరైజేషన్ ను పక్కపెట్టి.. పూర్తిగా ప్రొడక్షన్ వాల్యూస్, భారీతనం, స్టన్నింగ్ విజువల్స్ పై దృష్టిపెడుతూ టీజర్ ను కట్ చేశారు.

కేవలం దుబాయ్, అబుదాబి షెడ్యూల్ కోసమే 70 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు నిర్మాతలు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్, ఇంటర్నేషనల్ ఎక్విప్ మెంట్ తో ఆ షెడ్యూల్ ను పూర్తిచేశారు. బిజినెస్ లో భాగంగా చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, బయ్యర్లకు ఈ ఎపిసోడ్ నే చూపించారు. ఇప్పుడు టీజర్ లో కూడా వాటినే ఉంచారు.

ఈ సినిమా నుంచి తప్పుకున్న సంగీత దర్శకులు శంకర్-ఎహసాన్-లాయ్ పేర్లను ఇప్పటికే పోస్టర్ల నుంచి తొలిగించారు. టీజర్ లో కూడా వాళ్ల పేర్లు లేవు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది సాహో సినిమా. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు. 

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?