Advertisement

Advertisement


Home > Politics - Gossip

పచ్చ టీమ్ : దెయ్యాలు వేదాలు వల్లించినట్లు...

పచ్చ టీమ్ : దెయ్యాలు వేదాలు వల్లించినట్లు...

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, చంద్రబాబు వందిమాగధ బృందం ఇవాళ ప్రతిపక్షంలో సభ్యులుగా మారిపోయిన తర్వాత... శాసనసభలో సంప్రదాయాల గురించి మాట్లాడుతుండడం గమనిస్తే చిత్రంగా అనిపిస్తోంది. అసలు రాజ్యాంగ విలువల్ని, చట్టాల్ని కూడా పాటించకుండా తుంగలో తొక్కేసిన వారే... ఇవాళ సాంప్రదాయాలు పాటించడం లేదంటూ గొంతు చించుకోవడం గమనిస్తోంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నదని పలువురు దెప్పి పొడుస్తున్నారు.

స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రతిపక్షాన్ని కూడా సంప్రదించాలనే కనీస సంప్రదాయాన్ని జగన్మోహన రెడ్డి ప్రభుత్వం పాటించలేదని తెలుగుదేశం సభ్యులకు చాలా గుర్రుగా ఉంది. ఇప్పుడు ఇలా విలపిస్తున్నారు సరే.. సంప్రదాయాల సంగతి తర్వాత వారికి అసలు చట్టం మీదనైనా గౌరవం ఉన్నదా అనే ప్రశ్న ప్రజల్లో మెదలుతోంది.

గత ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబునాయుడు విచ్చలవిడిగా రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఫిరాయింపు నిరోధక చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ లో అపహాస్యం పాలైందంటే అతిశయోక్తికాదు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం మాత్రమేకాదు... వారికి మంత్రి పదవులు కట్టబెట్టి... తన సుదీర్ఘ అనుభవ రాజకీయ దిగజారుడుతనాన్ని చంద్రబాబు చాటుకున్నాడు.

రోజా మీద శాసనసభ నుంచి బహిష్కరణ వేటు పడినప్పుడు కూడా ఇదే తరహాలో వ్యవహరించారు. ఈ విషయంలో కోర్టు తీర్పులను సైతం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. విలువలను తుంగలో తొక్కారు. ప్రత్యేకించి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు విషయంలో వ్యవహారం కోర్టుకు వెళ్లినా.. కోర్టునుంచి తాకీదులు అందినా.. వైసీపీ నాయకత్వం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పీకరు పట్టించుకోలేదు.

ఈ రకంగా రాజ్యాంగాన్నే పట్టించుకోని వాళ్లు... ఇవాళ జగన్ ప్రభుత్వం సాంప్రదాయాల్ని పట్టించుకోలేదంటూ విలపించడం నవ్వు తెప్పిస్తోంది. తెలుగుదేశం నాయకులు ఇలాంటి పనికిరాని విషయాల జోలికి వెళ్లకుండా... పాలనలో ప్రజాసంక్షేమానికి విరుద్ధమైన లోపాలుంటే వాటి మీద పోరాటాలు చేసి ప్రజా ప్రయోజనాలకోసం పనిచేస్తే బాగుంటుంది.

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?