తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్.పిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి లు బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్ తో భేటీ అయ్యారని మీడియాలో వార్తలు వచ్చాయి.
తెలంగాణలో బిజెపిని టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తీసుకు రావాలని తలపెట్టిన కమలనాదులు ఇక్కడ బలమైన సామాజికవర్గం నేతలపై దృస్టి పెట్టారని అంటున్నారు. అందులో భాగంగానే రేవంత్, కోమటిరెడ్డిలతో చర్చలు జరిపి ఉండవచ్చని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలతో పాటు మాజీ ఎంపీ వివేక్, కేసీఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్య రావు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో భేటీ అయినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకునే అవకాశం లేకపోవడంతోనే పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీ టీడీపీకి చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం.